రాత్రి కలిస్తేనే తప్పుట?

బీజేపీ రాజుగారు తమాషాగా మాట్లాడుతారు. ఆయన ఒక్కోసారి జగన్ని మెచ్చుకుంటారు. మరోసారి విమర్శిస్తూంటారు. పార్టీ  వైఖరికి  భిన్నంగా జగన్ని మూడు రాజధానులు, ఇంగ్లీష్ మీడియం బోధన విషయంలో రాజుగాగు మెచ్చుకున్నారు. Advertisement ఇక ఇపుడు…

బీజేపీ రాజుగారు తమాషాగా మాట్లాడుతారు. ఆయన ఒక్కోసారి జగన్ని మెచ్చుకుంటారు. మరోసారి విమర్శిస్తూంటారు. పార్టీ  వైఖరికి  భిన్నంగా జగన్ని మూడు రాజధానులు, ఇంగ్లీష్ మీడియం బోధన విషయంలో రాజుగాగు మెచ్చుకున్నారు.

ఇక ఇపుడు ఏపీలో సంచలనంగా మారిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి  కామినేని శ్రీనివాస్ భేటీ కావడాన్ని విష్ణుకుమార్ రాజు గట్టిగా సమర్ధిస్తున్నారు. ఇందులో తప్పేముంది అంటున్నారు. పైగా వారంతా పగలే కలిసారు కదా అంటూ లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

అంటే రాత్రి మాత్రమే కలిస్తే తప్పా అన్న ప్రశ్నను ఆయనే మిగిలి ఉంచారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారి అవునో కాదో ముందు ప్రభుత్వం తేల్చాలని కూడా ఆయన అంటున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం ఎవ‌రు ఎవరినైనా కలవచ్చు అని కూడా రాజ్యాంగ సూత్రాలు వల్లెవేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉన్న్నా నిమ్మగడ్డ వివాదం  ఈనాటిది కాదు,  గత నాలుగు నెలలుగా ఏపీలో జరుగుతోంది. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాట్ హాట్ గా లేఖ రాశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం కంటే ముందే ఆయనే తాను ఏపీ ఎన్నికల అధికారిని అని ప్రకటించుకున్నారు. మరి ఇపుడు నిమ్మగడ్డ ఏ హోదాలో ఉన్నారో ఆయన్నే రాజుగారు అడిగితే బాగుంటుందేమో.

తన పదవి విషయంలో కోర్టుల్లో కేసు ఉన్నపుడు నిమ్మగడ్డ రాజకీయ నేతలను  కలవడమే ఇపుడు వివాదం. పైగా ఆయన రేపు కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ ఆ సీట్లో కూర్చోవాల్సిన మనిషి. అన్ని పార్టీలకు అతీతంగా ఉండాల్సిన మనిషి. అటువంటి నిమ్మగడ్డ రాజకీయ నాయకులతో రాసుకుపూసుకుతిరగడం వివాదం కాక వినోదం అవుతుందా. మరి రాజుగారి మాటలెపుడూ ఇలాగే తమాషాగానే ఉంటాయనుకోవాలేమో.

'వైఎస్సార్‌ కాపు నేస్తం' ప్రారంభం

ముఠా నాయకుడు బైటకు రావాలి