పవన్‌ పెళ్లిళ్ల పై నో కామెంట్స్ ప్లీజ్!

ఆంధ్ర‌ ప్రదేశ్ రాజకీయాలు మొత్తం మూడు రాజధానుల కంటే మూడు పెళ్లిళ్ల చూట్టే నడుస్తుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడు మీడియాతో మాట్లాడిన మీడియా నుంచి త‌ప్ప‌ని ప్రశ్న పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై…

ఆంధ్ర‌ ప్రదేశ్ రాజకీయాలు మొత్తం మూడు రాజధానుల కంటే మూడు పెళ్లిళ్ల చూట్టే నడుస్తుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడు మీడియాతో మాట్లాడిన మీడియా నుంచి త‌ప్ప‌ని ప్రశ్న పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై మీ సమాధానం ఏంటి? అని ఇవాళ కూడా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనంతపురం పర్యటనలో మీడియాతో మాట్లాడుతుండగా మీడియా వ్యక్తులు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై మీ సమాధానమేమిటి? అంటే.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై బీజేపీ స్పందించదని చెప్పేశారు. 

అలాగే ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం గురించి మాట్లాడే బీజేపీ నేతలు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షులు వీర్రాజు క‌ర్నూల్ హైకోర్టుపై మాట్లాడుతూ… రాష్ట్ర ప్ర‌భుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే త‌మ పార్టీకి ఎటువంటి అబ్జెక్షన్స్ లేదని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వ‌స్తే కేంద్ర ప్ర‌భుత్వం హైకోర్టు ఏర్పాటు చేయడానికి స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. మ‌రి అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధాని అని చెప్పుకుంటూన్నా బీజేపీ నేత‌లు రాయ‌ల‌సీమ‌పై ప్రేమ చూపించ‌డం కాస్తా విడూరంలాగే క‌నిపిస్తోంది.

అలాగే ఎప్పుడు చేప్పిన‌ట్లే బీజేపీ పార్టీ టీడీపీ-వైసీపీకి సమాన దూరంలో ఉంటుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ర్పంచులు నిధులు ఇవ్వ‌కుండా అభివృద్ధికి అడ్డుప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. అనంత‌పురంలో వ‌ర‌ద వ‌ల్ల న‌ష్టం జ‌రిగింద‌ని కానీ ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌రం అన్న సోము వీర్రాజు కేంద్రం నుండి రాష్ట్రానికి రావ‌ల్సిన నిధులు గురించి స్పందించి ఉంటే బాగుండేదంటూన్నారు విశ్లేష‌కులు.