వైకాపా కోసం ఆర్జీవీ సినిమా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా అదృష్టవంతుడు. సినిమాలు హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా చేతినిండా పని వుంటూనే వుంటుంది. కోట్లకు కోట్లు టర్నోవర్ అవుతూనే వుంటాయి. ఈ మధ్య కొంతకాలం నుంచి…

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా అదృష్టవంతుడు. సినిమాలు హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా చేతినిండా పని వుంటూనే వుంటుంది. కోట్లకు కోట్లు టర్నోవర్ అవుతూనే వుంటాయి. ఈ మధ్య కొంతకాలం నుంచి వర్మ పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ తెరవెనుక వర్మ తన పనులు చక్కబెట్టుకుంటూనే వున్నారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలకు పన్నెండు లక్షల అద్దె చెల్లించే అయిందు అంతస్తుల భవనాన్ని ఆఫీసుగా తీసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాల మీద వర్క్ చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే ఆ మూడింటిలో రెండు పొలిటికల్ టచ్ సినిమాలు కావడం. వీటి వెనుక పొలిటికల్ పార్టీలు దన్నుగా వుండి పెట్టుబడులు పెట్టడం.

ఒక సినిమాకు ఎంపీ మిధున్ రెడ్డి అండదండలు అందిస్తున్నారని తెలుస్తోంది. పూర్తిగా వైకాపాకు అనుకూలంగా తేదేపాకు వ్యతిరేకంగా ఈ సినిమా స్క్రిప్ట్ వుంటుందట.

ఇది కాక మరో సినిమాను భాజపాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా తీయబోతున్నారు. దీనికి కర్ణాటకకు చెందిన డికె శివకుమార్ బ్యాకింగ్ అని తెలుస్తోంది.

ఈ రెండు కాక వర్మ తన స్టయిలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇలా మూడు సినిమాలు కలిపి దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ అని, అందుకే భారీ ఆఫీసు తీసి పనులు ప్రారంభించారని బోగట్టా.

ఏమైనా ఆర్జీవీ మహర్జాతకుడే.