సీరియల్ నటుడికి కరోనా

షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా సెట్ మీదకు వెళ్లడం లేదు సినిమాలు. కానీ టీవీ సీరియళ్లు మాత్రం ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగ్ లు ప్రారంభించాయి. త్వరలో ప్రసారాలు మొదలుపెడుతున్నామని…

షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా సెట్ మీదకు వెళ్లడం లేదు సినిమాలు. కానీ టీవీ సీరియళ్లు మాత్రం ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగ్ లు ప్రారంభించాయి. త్వరలో ప్రసారాలు మొదలుపెడుతున్నామని టీవీల్లో ప్రోమో లు ఊదరగొడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్లుండి ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న నటుడికి కరోనా సోకినట్లు వార్తలు బయటకు వచ్చాయి.

అర్జెంట్ గా షూటింగ్ లు నిలిపేసారు. దీంతో ఇప్పుడు మిగిలిన షూటింగ్ ల పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది.  అసలే ఇప్పటికే టాలీవుడ్ లో కరోనా కేసులు వున్నాయన్న రూమర్లు వున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ కు పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీరియల్స్ నటించే నటుడికి సోకింది.

దీంతో ఇక పూర్తిగా ఇటు సినిమాలు, అటు సీరియళ్ల షూటింగ్ లు నిలిచిపోవడం తప్పడం లేదు. జూన్ వస్తుంది షూటింగ్ లు చేసుకునే పరిస్థితి వస్తుంది అని సినిమా, టీవీ రంగాలు సంతోష పడ్డాయి. ప్రభుత్వం కూడా పలు నిబంధనలు విధించి మరీ అనుమతి ఇచ్చింది. కానీ పరిస్థితి చూస్తే ఏమాత్రం అనుకూలంగా లేదు.

ఈ పరిస్థితి ఇలా మరో నెలా రెండు నెలలు కొనసాగితే, దసరా సీజన్ ను కూడా టాలీవుడ్ మిస్ అయిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని వర్గాలు అయితే షూటింగ్ లు ఆగస్టు తరువాతే అని కూడా అంటున్నాయి.

పార్క్ హయత్ లో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ ర‌హ‌స్య స‌మావేశం