నిర్మాత అంటే సినిమాను ప్రేమించాలి. డబ్బులున్నంతమాత్రాన సరిపోదు. నిర్మాతకు ప్రేమ వుంటే అదే వేరే లెవెల్ లో వుంటుంది. సితార సంస్థ ఈ రోజు భీమ్లానాయక్ ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసింది.
ఈ పాట సినిమాలో వుంటుంది కానీ, ఇప్పుడు బయటకు వచ్చిన వీడీయో కాదు. సినిమాలో చిత్రీకరణ వేరుగా వుంటుంది. ఇప్పుడు వచ్చింది జస్ట్ కవర్ సాంగ్ మాత్రమే.
ఈ కవర్ సాంగ్ కు అయిన ఖర్చు అక్షరాలా నలభై లక్షలు. థమన్ యూనిట్ ను, గాయకులను లోకేషన్ కు తీసుకెళ్లడం, యూనిట్ మొత్తాన్ని తరలించి షూట్ చేయడం ఒక ఎత్తు.
ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి ఫోక్ సింగర్ ను తీసుకురావడం ఇవన్నీ ఖర్చులే. అదీ కాక, పాటను సినిమాకు వాడిన టెక్నికల్ స్టాండర్స్ లెవెల్ లోనే పిక్చరైజ్ చేయడం, డిఐ చేయడం, విఎఫ్ఎక్స్ వర్క్ చేయడం ఇవన్నీ ఓ లెక్కలో ఖర్చు చేసారు.
భీమ్లానాయక్ సాంగ్ కు మాత్రమే కాదు, గతంలో అలవైకుంఠపురములో సాంగ్ లకు కూడా ఇలాగే కవర్ సాంగ్ లు చేసి, కోట్లు ఖర్చు చేసారు. ఇప్పుడు మళ్లీ అదే సిస్టమ్ ను భీమ్లా నాయక్ విషయం లో కూడా ఫాలో అవుతున్నారు. సినిమా బడ్జెట్ కు ఇదంతా అదనమే. అయితే సినిమాకు బజ్ పెంచడానికి , ఫ్యాన్స్ దగ్గరకు సినిమాను తీసుకెళ్లడానికి ఈ మేరకు ఖర్చు తప్పదేమో?
అయితే భీమ్లానాయక్ సినిమా అడియో రైట్స్ అయిదు కోట్ల మేరకు విక్రయించారు. అందువల్ల ఆ మొత్తం అంతా ఇటు డైవర్ట్ చేయాలేమో?