కరోనా అనే మహమ్మారి పేద – ధనిక, సామాన్యులు – సెలబ్రిటీలనే తేడా లేకుండా అటాక్ చేస్తుండడం చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు కరోనాబారిన పడ్డ విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలు సైతం కరోనా మహమ్మారికి గురై అల్లాడిపోతున్నారు.
ఈ నేపథ్యంలో సౌత్ స్టార్ బ్యూటీతో పాటు ఆమె భర్త, యంగ్ హీరోకి కూడా కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. టాలీవుడ్లో ప్రముఖ సినీ కుటుంబ వారసత్వం గల ఆ హీరో దంపతులకు కరోనా వైరస్ సోకి ఉంటుందనే అనుమానాలకు బలం చేకూర్చే అంశాలు లేకపోలేదు.
ఇటీవల ఆ సౌత్ స్టార్ బ్యూటీ ఫ్రెండ్ కూడా కరోనా బారిన పడింది. తన ఫ్రెండ్ అయిన సదరు పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ బుగ్గపై అందాల భామ ముద్దు పెట్టిన ఫొటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశారు. ఇది షేర్ చేసిన కొన్ని రోజులకే ఆ ఫ్రెండ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోహీరోయిన్ల ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమె షేర్ చేసిన ఫొటో ఇప్పటిదా లేక పాతదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఫొటోపై క్లారిటీ వస్తే కరోనాపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. అయినప్పటికీ నేటి విపత్కర పరిస్థితుల్లో ఎవరికైనా కరోనా వ్యాపించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.