వర్తమాన రాజకీయాల్లో మౌన మునిగా ఉన్న గంటా శ్రీనివాస్ కూడా ఎట్టకేలకు పెదవి విప్పాల్సివచ్చింది. . ఆయనకు మౌనవ్రత భంగం అయింది. ఆయన అతి ముఖ్య అనుచరుడు నలందా కిషోర్ మీద సీఇడీ గురి పెట్టింది. ఆయన్ని అదుపులోకి తీసుకుంది.
సోషల్ మీడియాలో ఎంపీ విజయసాయిరెడ్డి మీద, మంత్రి అవంతి శ్రీనివాస్ మీద అసభ్య పోస్టింగులు పెడుతున్నారన్న కారణాన ఆయన్ని సీఐడి అదుపులోకి తీఎసుకుందని అంటున్నారు. ఇదిలా ఉండగా తన అనుచరుడుని సీఐడీ అదుపులోకి తీసుకోవడంతో గంటా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
ఎట్టకేలకు ఆయన పెదవి విప్పారు. మావాడిది తప్పులేదని అంటున్నారు. నా మీద కక్ష ఉంటే కేసులు పెట్టండి నేను రెడీ అంటూ సవాల్ కూడా చేస్తున్నారు. నలందా కిషోర్ ఏ తప్పూ చేయలేదని కూడా గంటా అంటున్నారు.
మొత్తం మీద చూస్తూంటే ఇన్నాళ్ళు అధికార పార్టీని ఒక్క మాట అనకుండా వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటించిన గంటా తన కాళ్ళ కిందకు నీళ్ళు రాగానే మాటల తూటాలు వదులుతున్నారని టీడీపీలోనే వినిపిస్తోంది. టీడీపీకి చెందిన విపక్ష నేతలను అరెస్ట్ చేసిన సందర్భంల్లోనూ గంటా మాట్లాడలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
మరో వైపు గంటా అనుచరుడిదాకా కధ వచ్చేసిందంటే రేపో మాపో గంటా కోరుకుంటున్నట్లుగా ఆయన మీద కేసులు పడతాయని వైసీపీ నుంచి వస్తున్న మాట. మరి చూడాలి. అపుడు గంటా నాదం ఎలా ఉంటుందో.