బాలీవుడ్ సింగర్, రియాల్టీ షో జడ్జి నేహా కక్కర్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది. బాలీవుడ్ హీరో సుశీంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో…మరీ ముఖ్యంగా హీరోయిన్లు, ఇతర మహిళా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా నిరసన గళం విప్పుతున్నారు. మరి కొందరు సోషల్ మీడియాను విడిచిపెడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడా జాబితాలో సింగర్ నేహా చేరింది. ఈ సందర్భంగా ఆమె ఘాటైన పదజాలంతో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
“నేను సోషల్ మీడియాను వదిలి వెళ్తున్నా.. కానీ చావట్లేదు” అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ రాసింది. అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే ఈ నిర్ణయం తాత్కాలికం మాత్రమే అని పేర్కొంది. బాలీవుడ్‌లో పరిస్థితులన్నీ చక్కబడ్డాక మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతానని ఆమె రాసుకొచ్చింది. నేహా భావోద్వేగంగా రాసిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
''నేను నిద్రపోతున్నాను. ప్రపంచం బాగుపడినప్పుడు నిద్ర లేపండి. ఈ ప్రపంచంలో స్వేచ్ఛ, ప్రేమ, గౌరవం, సంరక్షణ, సరదా, మంచి వ్యక్తులతోపాటు ద్వేషం, స్వపక్షం, అసూయ, బెదిరింపు, హత్య, ఆత్మహత్య, చెడ్డ వ్యక్తులు కూడా ఉండాలి. ఎవరైనా నా గురించి చెడుగా భావిస్తే నన్ను క్షమించండి. శుభ రాత్రి. బాధపడకండి.. నేనేమీ చనిపోవడం లేదు. కొద్ది రోజులు దూరంగా వెళుతున్నాను'' అని పేర్కొంది. ఈ పోస్ట్ చదివితే మాత్రం ఆమె ఏదో డిఫ్రెషన్‌లో ఉన్నట్టు అర్థమవుతోంది.