సర్కారుకు ఎదురుదెబ్బ : తర్వాత ఏంటి?

జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా.. జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి నవయుగ సంస్థకు కేటాయించిన కాంట్రాక్టును రద్దుచేస్తూ జెన్ కో సంస్థ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ జలవిద్యుత్తు…

జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా.. జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి నవయుగ సంస్థకు కేటాయించిన కాంట్రాక్టును రద్దుచేస్తూ జెన్ కో సంస్థ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా టెండర్లు పిలిచే ప్రయత్నం జరుగుతోంది. రీటెండర్లకు నోటిఫికేషన్ కూడా వెలువడింది. అయితే.. జెన్‌కో ఇచ్చిన రద్దు ఉత్తర్వులు చెల్లవంటూ గురువారం ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ!

గత ప్రభుత్వం పాల్పడిన అవినీతిని లెక్కతేల్చి… నిర్మూలించేందుకు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి చాలా గట్టిగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా కాంట్రాక్టుల విషయంలో చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. చాలావరకు పనుల్ని నిలుపుదల చేసి.. ప్రత్యేక కమిటీవేసి.. అవినీతిని లెక్కతేలుస్తున్నారు. ఈలోగా పోలవరం డ్యాం పనులను, జలవిద్యుత్తు ప్రాజెక్టు పనులను కూడా ఆపేశారు. ఈ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ… కాంట్రాక్టులను ప్రభుత్వం రద్దుచేసింది. ఈ వ్యవహారంపై విపక్షాలు నానాయాగీ చేస్తున్నాయి.

అయితే నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. జెన్‌కో తమకు కేటాయించిన జలవిద్యుత్తు ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం కేవలం థర్డ్ పార్టీ మాత్రమేనని వారు వాదించారు. రీటెండర్లకు వెళ్లకుండా ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం రీటెండరింగ్ ప్రక్రియను అనుమతించాలని వాదించింది.

ప్రభుత్వ వాదనను కోర్టు పట్టించుకోలేదు. కాంట్రాక్టును ప్రీక్లోజర్ చేస్తూ జెన్ కో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. రీటెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బే. దీనివలన ఈ పనులను నవయుగ సంస్థ కొనసాగించే అవకాశం ఉంటుంది.

అయితే ఇప్పటిదాకా తమకు స్థలమే అప్పగించలేదని వారు వాదిస్తున్నారు. తమను కొనసాగిస్తే.. ఒప్పందం ప్రకారం గడువులోగా పని పూర్తిచేస్తాం అంటున్నారు. స్థలం అప్పగింతలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?