Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విజయ్ 'ఫైటర్'

విజయ్ 'ఫైటర్'

పూరి జగన్నాధ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తి సమస్య వున్న హీరో క్యారెక్టర్ చేయబోతున్నాడంటూ ముందుగానే గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో బన్నీకి చెప్పి, రెండు సీన్లు నచ్చినా టోటల్ స్క్రిప్ట్ నచ్చక, పక్కన పెట్టింది ఇదే. గతంలో తాను ఎన్టీఆర్ కు నత్తి క్యారెక్టర్ ఒకటి చెప్పాను అంటూ పూరి ఓసారి వెల్లడించిందీ ఇదే.

ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కు విజయ్ ఓకె అన్నాడు. ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఛాంబర్ లో దరఖాస్తు అందించారు. ఓకె కావాల్సి వుంది. అయితే ఫైటర్ అన్న టైటిల్ గతంలో ఎవరికో వుందని గ్యాసిప్ వినిపిస్తోంది. ఎవరికీ లేకపోతే వీళ్లకే ఇస్తారు. లేదూ అంటే విజయ్ ఫైటర్ అనో, మరోటి అనో తెచ్చుకొవాల్సి వుంటుంది.

టెంపర్, లోఫర్, ఇస్మార్ట్ శంకర్, సూపర్, గోలీమార్, ఇలా పేరు చివర్న 'ర్' అక్షరం వచ్చిన టైటిళ్లు పూరి నుంచి చాలానే వచ్చాయి. ఇప్పుడు ఆ కోవలోనే ఫైటర్ అనే టైటిల్ పెట్టినట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండకు ఇలాంటి టైటిల్ తొలిసారి అనుకోవాలి. అందరు హీరోలను తన స్టయిల్ లో మేకోవర్ చేసి చూపించిన పూరి జగన్నాధ్, ఫైటర్ గా విజయ్ ను ఎలా చూపించబోతున్నాడో మరి.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?