అనుష్క సెక్యూరిటీ గార్డు జీతం రూ.1.2 కోట్లు!

సినిమా సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ఏ వ్య‌వ‌హారంలో అయినా కోట్ల రూపాయ‌ల నంబ‌ర్లు వినిపించ‌డం చాలా రొటీన్ గా మారింది. ఈ క్ర‌మంలో వారి స‌హాయ సిబ్బంది జీత‌భ‌త్యాలు కూడా అదే స్థాయికి చేరిన‌ట్టుగా ఉన్నాయి. …

సినిమా సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ఏ వ్య‌వ‌హారంలో అయినా కోట్ల రూపాయ‌ల నంబ‌ర్లు వినిపించ‌డం చాలా రొటీన్ గా మారింది. ఈ క్ర‌మంలో వారి స‌హాయ సిబ్బంది జీత‌భ‌త్యాలు కూడా అదే స్థాయికి చేరిన‌ట్టుగా ఉన్నాయి. 

త‌మ‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుల‌ను పెట్టుకోవాల్సిన పొజిష‌న్ల కోసం తార‌లు కోట్ల రూపాయ‌ల మొత్తాల‌ను వెచ్చించ‌డానికి కూడా వెనుకాడం లేదు. ఈ క్ర‌మంలో న‌టి, టీమిండియా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ కొహ్లీ భార్య అనుష్కాశ‌ర్మ త‌న ప్ర‌ధాన సెక్యూరిటీ ఆఫీస‌ర్ కు ఇస్తున్న జీతం హాట్ టాపిక్ అవుతోంది. ఆ పొజిష‌న్లోని ప్రైవేట్ వ్య‌క్తికి అనుష్క ఏకంగా 1.2 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని జీతంగా ఇస్తోందంట‌.

ఏడాదికి 1.2 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని అనుష్క అత‌డికి జీతంగా ఇస్తోంద‌ట‌. ఆమె ఇండియాలో ఉన్న‌ప్పుడు, ప‌బ్లిక్ లోకి వ‌చ్చిన‌ప్పుడు క‌వ‌చంలా ప‌ని చేయ‌డ‌మే అత‌డి ప‌ని. త‌న పేరు ప్ర‌కాష్ సింగ్. సోనూ అని పిలుస్తారు. ఇత‌డు అనుష్క‌తో పాటు చాలా సంవ‌త్స‌రాలుగా ఉంటున్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆమెకు బాగా న‌మ్మ‌క‌స్తుడిగా మెలుగుతూ వ‌స్తున్నాడ‌ట‌. 

అత‌డిని కుటుంబ స‌భ్యుడిగా ట్రీట్ చేస్తుంద‌ట అనుష్క‌. సినిమా సెట్స్ మీద అత‌డి పుట్టిన రోజును సెల‌బ్రేట్ చేసిన సంద‌ర్భం కూడా ఉంది. ఇంత‌లా అత‌డిని ఒక కుటుంబ స‌భ్యుడిలా చూసుకోవ‌డ‌మే గాక‌, ఏకంగా నెల‌కు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల శాల‌రీని ఇస్తోంది అనుష్క‌.

ఏడాదికి 1.2 కోట్ల రూపాయ‌లంటే.. ఇది కార్పొరేట్ కంపెనీల సీఈవోల స్థాయి జీతమ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక సెక్యూరిటీ గార్డు హోదాలోనే అనుష్క కోసం ప‌ని చేసే వ్య‌క్తి ఈ డ‌బ్బును జీతంగా తీసుకుంటున్నాడు. ఇత‌డు కేవ‌లం అనుష్క సెక్యూరిటీ మాత్ర‌మే. విరాట్ కొహ్లీకి వేరే సిబ్బంది ఉన్నారు. వారి జీతాలేమో కానీ, అనుష్క మాత్రం త‌న బాడీగార్డుకు భారీ జీతాన్ని ఇస్తోంది. 

కేవ‌లం అనుష్క మాత్ర‌మే కాద‌ట‌, బాలీవుడ్ లో మ‌రి కొంత‌మంది సెల‌బ్రిటీలు కూడా ఇదే త‌ర‌హాలో జీతాల‌ను ఇస్తున్నార‌ట‌. కింగ్ ఖాన్ షారూక్ అయితే ఏకంగా త‌న ప్ర‌ధాన సెక్యూరిటీ వ్య‌క్తికి ఏకంగా రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల వార్షిక జీతాన్ని ఇస్తున్నాడ‌ట‌. త‌మ‌ను కాపాడుతున్నందుకు ఇదీ బాలీవుడ్ సెల‌బ్రిటీలు సెక్యూరిటీ సిబ్బందికి ఇస్తున్న వేత‌నం. 

ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చిన‌ప్పుడు వారు మీద ప‌డిపోకుండా క‌వచంలా నిల‌వ‌డ‌మే కాదు, వ్య‌క్తిగ‌త జీవితంలోని ప్రైవ‌సీని నిల‌బెట్ట‌డం వ‌ర‌కూ సెక్యూరిటీల మీద సెల‌బ్రిటీల‌కు చాలా ఆధార‌ప‌డాల్సి ఉండ‌వ‌చ్చు. అందుకే ఎక్కువ జీతాలు ఇచ్చి అయినా  న‌మ్మ‌క‌స్తుల‌నే ద‌గ్గ‌ర పెట్టుకోవ‌డంలో వింత ఏమీ లేదేమో!