‘సంపత్ బోయపాటి’ ట్రైలర్‌

దర్శకుడు సంపత్ నంది చేతిలో ఇంకా పడాల్సిన రేంజ్ సినిమా పడలేదు. రచ్చ సినిమాతో మాస్ రచ్చ రచ్చ చేసి చూపించాడు. ఆ తరువాత సినిమాలు అన్నీ కూడా అతనిలో మాస్ యాంగిల్ ను…

దర్శకుడు సంపత్ నంది చేతిలో ఇంకా పడాల్సిన రేంజ్ సినిమా పడలేదు. రచ్చ సినిమాతో మాస్ రచ్చ రచ్చ చేసి చూపించాడు. ఆ తరువాత సినిమాలు అన్నీ కూడా అతనిలో మాస్ యాంగిల్ ను తెగ చూపిస్తున్నాయి కానీ రావాల్సిన రేంజ్ రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో సంపత్ నంది లేటెస్ట్ సినిమా ' సీటీమార్' ట్రైలర్‌ వచ్చింది.

నిజానికి కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ సినిమా కదా అనుకుంటే, వీర..ఊర మాస్ అనిపించింది ట్రైలర్‌. గోపీచంద్ భారీ ఆయుధాలు పట్టుకుని మరీ విరుచుకుపడిపోయాడు. 'ఆడేవాళ్ల దృష్టి గీత మీద కూత మీద మాత్రమే వుండాలి' అనే మాంచి పంచ్ డైలాగులు వినిపించాయి ట్రైలర్‌ లో. 

ఇప్పటికే పాపులర్ అయిన జ్వాలా రెడ్డి సాంగ్ బిట్ మరీ ఎట్ ఎ గ్లాన్స్ చూపించడం కాస్త నిరుత్సాహమే. పచ్చని పంటచేల నుంచి 'సాలే' అనే నార్త్ ఇండియన్ విలన్ వరకు ట్రైలర్‌ సాగింది అంటే కథ ఓ లెక్కలో వుండి వుంటుదనుకోవాలి. 

మొత్తం మీద సంపత్ నంది తన మాస్ యాంగిల్ ను బోయపాటి లెవెల్లో చూపించేసారు.