తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే వెన్నుపోటు అంటేనే టక్కున గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు రాజకీయం గురించి అందరి తెలిసిందే. పక్కనే ఉంటూ అవకాశం కోసం ఎదురు చూసి పక్కకు తోసేసి మామ కుర్చిలో కుర్చున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న మునుగోడు ఉపఎన్నికల్లో గ్రామా స్ధాయి నాయకుల నుండి మొదలు కొని రాష్ట్ర స్ధాయి నాయకుల వరకు అదర్శంగా నిలుస్తున్నారు. మునుగోడులో కొంత మంది నేతలు కూడా సోంత పార్టీ నేతలనే వెన్నుపోట్లు పొడుస్తున్నారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక పార్టీ వైపు ప్రచారం చేస్తునే రాత్రి కల్లా వేరే పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అలాగని ఆ పార్టీలో ఉంటారు అంటే అలా లేదు మళ్లీ రోజు అదే పార్టీలోకి వస్తున్నారు. ఇలాంటి నాయకులను పార్టీ అధినేతలు చూసి వీరు ఓట్లు వేస్తారో లేక పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారా అనే భయం వెంటాడుతుంది. కానీ కొంత మంది నాయకులు మాత్రం ఏదో ఒక్కటి ఎన్నికల వరకు తోడుగా పెట్టుకుందాం అనుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కానీ కొంత మంది నేతలు గ్రామా స్ధాయి నేతలకు, ఓటర్లలకు తాయిలాలు ఇచ్చి వారిని గుడికి తీసుకువెళ్లి మీ పార్టీకే ఓటేస్తాం అని ప్రమాణం చేయమంటూ ప్రమాణం చేపించుకుంటున్నారు బహుశా వారి మీద నమ్మకం లేక కనీసం దేవుడు మీద అయినా భారం వేసినట్టు కనిపిస్తుంది. మునుగోడు ఎన్నికల్లో ఓటు ఎంత రేటు పలుకుతుందే వారి మాటలోనే ఆర్ధం అవుతుంది. ఇక్కడ డబ్బు కంటే విజయం ఆవసరం చాల ఉంది అందుకే నాయకులు నానా తిప్పలు పడుతున్నారు.
ఏదేమైనా మునుగోడు ఉప ఎన్నికలు ఫలితాలు తరువాత డబ్బు, తాయిలాల ప్రభావం ఎంత వరకు పని చేసింది అనేది క్లారిటి వస్తుందని, ఓట్లు డబ్బుతో పడుతున్నాయా లేక డబ్బు పంచినా ఓట్లు పడలేదా అనేది ఒక క్లారిటీ వస్తే మిగత నాయకులు కూడా వచ్చే ఎన్నికల్లో డబ్బు ఖర్చుపై క్లారిటి వస్తుందంటూన్నారు విశ్లేషకులు.