బీజేపీలోకి యామిని.. పాపం లోకేష్ పరిస్థితేంటి?

“టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ కొట్టడం కొత్తేంకాదు. స్వయానా రాజ్యసభ సభ్యులే గోడ దూకేశారు. అలాంటిది యామిని జంప్ జిలానీ అంటే అందులో పెద్ద వింతేముంది.” ఎవరైనా ఇలా ఆలోచించడం సహజం. కానీ ఇక్కడే…

“టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ కొట్టడం కొత్తేంకాదు. స్వయానా రాజ్యసభ సభ్యులే గోడ దూకేశారు. అలాంటిది యామిని జంప్ జిలానీ అంటే అందులో పెద్ద వింతేముంది.” ఎవరైనా ఇలా ఆలోచించడం సహజం. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇప్పటివరకు వెళ్లిన వాళ్లంతా ఒకెత్తు. యామని మరోఎత్తు. ఈమె లోకేష్ కు చెందినవ్యక్తి. ఇంకా చెప్పాలంటే టీడీపీలో లోకేష్ టీమ్ మెంబర్. లోకేష్ వ్యవహారాలు, అతడి బలహీనతలు అన్నీ తెలిసిన ఇలాంటి వ్యక్తి బీజేపీలోకి జంప్ అవుతున్నారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్.

టీడీపీలో కాకలుతిరిగిన నేతలున్నారు. తిమ్మిని బమ్మిని చేయగల ఉద్దండులున్నారు. అలాంటి పోటీ మధ్య కూడా అధికార ప్రతినిధి హోదా పట్టేశారు యామిని. దీనికి కారణం ఆమె కేవలం లోకేష్ వర్గానికి చెందిన వ్యక్తి కావడమే. చినబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో యామిని ఒకరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలోకి జంప్ అవుతున్నారనే వార్తలు లోకేష్ ను ఇబ్బంది పెడుతున్నాయి. అసలే ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న యామిని, భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన తర్వాత తన బండారం బయటపెడుతుందేమోనని లోకేష్ భయం.

యామిని నోరువిప్పితే సోషల్ మీడియా షేక్ అవుతుంది. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆమె చేసిన ఆరోపణలు, చేసిన కామెంట్స్ అత్యంత వివాదాస్పదం అయ్యాయి. పవన్ తో పాటు ఎంతోమంది వైసీపీ నేతలపై ఎన్నికల టైమ్ లో ఆమె విరుచుకుపడ్డారు. అలాంటి నేత ఇప్పుడు కాషాయం కండువా కప్పుకొని టీడీపీని టార్గెట్ చేస్తే, ఫస్ట్ బుక్ అయ్యేది ఎవరనే విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే లోకేష్ కు ఇంత టెన్షన్.

తన వ్యవహారాలన్నీ బాగా తెలిసిన యామిని పార్టీ మారకుండా ఉండేందుకు స్వయంగా లోకేష్ రంగంలోకి దిగారు. ఆమెను బుజ్జిగించే ప్రయత్నాలు ఎప్పుడో స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని యామిని ప్రకటించించారట. ఈ సమాధానంతో లోకేష్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, యామిని బీజేపీలోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!