కేసీఆర్, మోదీ.. చేస్తున్నది ఒకటే పని

ఎవ్వరూ తక్కువ కాదు. ఇక్కడ కేసీఆర్ చేస్తున్న పనినే… అక్కడ మోడీ చేయబోతున్నారు. తెలంగాణలో శాసనసభకు కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గత అయిదేళ్లనుంచి అనుకుంటూ.. తాజాగా ఆ అంశాన్ని తెరపైకి…

ఎవ్వరూ తక్కువ కాదు. ఇక్కడ కేసీఆర్ చేస్తున్న పనినే… అక్కడ మోడీ చేయబోతున్నారు. తెలంగాణలో శాసనసభకు కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గత అయిదేళ్లనుంచి అనుకుంటూ.. తాజాగా ఆ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పుడు కేంద్రంలో కూడా అలాంటి ప్రయత్నమే జరగబోతోంది. సరికొత్త పార్లమెంటు భవనం నిర్మించాలనే ఆలోచనను ప్రధాని మోడీ బయటపెట్టారు. సుమారు రెండేళ్ల వ్యవధిలోనే దానిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు కూడా ప్రకటించేశారు.

ఢిల్లీ నార్త్ ఎవెన్యూలో ఎంపీలకోసం ప్రభుత్వం నిర్మించిన 36 డూప్లెక్స్ భవనాలను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత పార్లమెంటుకు కొత్త రూపు తీసుకువచ్చేందుకు, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు లేదా, కొత్త పార్లమెంటు నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని అన్నారు. పార్లమెంటు ఆధునికీకరణ కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లాలు పార్లమెంటు సమావేశాల సమయంలో తనను కోరినట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న చారిత్రక భవనంలో వసతులు మెరుగుపరుస్తారా? లేదా, కొత్త భవనం నిర్మించాలా అనేది అధికారుల సమీక్షలో ఉన్నదని వారి నుంచి నివేదిక రాగానే ప్రభుత్వం పనులు చేపడుతుందని చెప్పుకొచ్చారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఆలోగా కొత్త పార్లమెంటు నిర్మాణం పూర్తి చేసే ఆలోచన ఉన్నట్లుగా కూడా మోడీ చెబుతున్నారు. కేసీఆర్, నరేంద్రమోడీ ఇద్దరూ  కూడా ఒకే తరహాలో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కాలగర్భంలో కలిసి పోకుండా.. చరిత్రలో తమదంటూ ఒక ముద్రలాగా మిగిలే అపూర్వమైన నిర్మాణం చేపట్టాలనే సంకల్పం కేసీఆర్ కు తొలినుంచి ఉంది. అందుకే ఆయన కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ, కొత్త ఆడిటోరియం లాంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. చూడబోతే.. నరేంద్రమోడీ కూడా.. అదే తరహాలో దేశంలో తన ముద్ర మరో వందేళ్ల పాటు మిగిలిఉండేలా.. కొత్త పార్లమెంటు నిర్మించాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!