అల వైకుంఠపురములో.. ఇంట్రడ్యూసింగ్ టీజర్ వచ్చేసింది. ఇన్నాళ్లు సినిమా చేయకుండా వుండిపోయినందుకు వివరణ అన్నట్లుగా ఆ టీజర్ లో డైలాగ్ కట్ చేసారు. గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంటూ. అవ్వ పేరే ముసలమ్మ అన్నట్లుగా వుంది ఈ డైలాగు. గ్యాప్ తీసుకుంటేనేం.. వస్తేనేం.. ఏదైనా ఒకటే. అల్లు అర్జున్ సినిమా ఒక్కటీ కూడా ఈ ఏడాది లేదు అన్నదే మీనింగ్.
సరే ఆ సంగతి అలావుంచితే, టీజర్ లో బన్నీ లుక్స్ మీద అప్పుడే గుసగుసలు సార్ట్ అయ్యాయి. ఇదివరకు వుండే హుషారు కళ్లలో, ఫేస్ లో లేదని, ఎంత పాత్రోచితంగా డైలాగు చెప్పించినా, ఫేస్ లో ఏదో తెలియని డల్ నెస్ కనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఆ హెయిర్ స్టయిల్ మీద కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలో వరుడు లాంటి అరివీర భయంకర ఫ్లాపు సినిమాలో కూడా ఇదే హెయిర్ స్టయిల్ వుందని క్రిటిసిజిమ్ వస్తోంది. అసలే త్రివిక్రమ్-బన్నీ సినిమా నత్త నడక నడుస్తోంది. దీనికి పోటీగా వస్తున్న మహేష్ సినిమా చకచకా పరుగులు పెడుతోంది. సూపర్ ఫన్ తో వస్తోంది అన్న టాక్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
బన్నీ సినిమా ఇప్పటి వరకు ఫైట్లు తీయడంతోనే సరిపోతోంది. అసలు స్టోరీ చిత్రీకరణలోకి ఇప్పటిదాకా ప్రవేశించలేదని టాక్ వుంది. అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న టబు ఇంటి సెట్ లోనే అసలు కథ చిత్రీకరణ వుంటుందని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎక్కడ చేసినా, బిల్డప్ షాట్లు, ఫైట్ షాట్ లే తీసారని టాక్ వుంది.
సంక్రాంతి విడుదల కాబట్టి టైమ్ చాలావుంది. అందువల్ల టైమ్ సమస్యలేదు. తివిక్రమ్ సెంకడాఫ్ స్క్రిప్ట్ ను ఏం చేసారన్నదాన్ని బట్టే వుంటుంది టోటల్ వ్యవహారం.