నిమ్మ‌కు నీరెత్తిన చందంగా…

శ్రీ‌శైలం జ‌లాశ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం దౌర్జ‌న్యంగా విద్యుత్ ఉత్ప‌త్తికి తెగ‌బ‌డ‌డంపై ఏపీ ప్ర‌భుత్వం ఆందోళ‌న, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే అనేక మార్లు ఈ విష‌య‌మై కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ (కేఆర్ఎంబీ)కు ఏపీ ప్ర‌భుత్వం…

శ్రీ‌శైలం జ‌లాశ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం దౌర్జ‌న్యంగా విద్యుత్ ఉత్ప‌త్తికి తెగ‌బ‌డ‌డంపై ఏపీ ప్ర‌భుత్వం ఆందోళ‌న, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే అనేక మార్లు ఈ విష‌య‌మై కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ (కేఆర్ఎంబీ)కు ఏపీ ప్ర‌భుత్వం లేఖ‌లు రాసింది. అలాగే కేంద్ర‌జ‌ల‌శ‌క్తి మంత్రి, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు.

అయిన‌ప్ప‌టికీ కేఆర్ఎంబీ, కేంద్ర‌ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంటుంద‌నే ఆశ ఏపీ ప్ర‌భుత్వంలో ఇంకా ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తిపై మ‌రోసారి కేఆర్ఎంబీకి ఏపీ ప్ర‌భుత్వం లేఖ రాసింది. తెలంగాణ వైఖ‌రిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

ఉమ్మడి ప్రాజెక్టులపై సాగు, తాగునీటి అవసరాలను పరిగణించి విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టీఎస్‌ జెన్‌కో చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది.

మ‌రోవైపు ఏపీ ప్ర‌భుత్వం త‌న రాష్ట్రంలో అక్ర‌మ ప్రాజెక్టులు చేప‌ట్టింద‌ని, నీటి కేటాయింపులు చేస్తోందంటూ ప‌దేప‌దే కేఆర్ఎంబీకి, కేంద్ర‌జ‌ల‌శ‌క్తి మంత్రికి లేఖ‌లు రాస్తున్న సంగ‌తి తెలిసిందే. 

రెండు తెలుగు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌రం నీటి విష‌య‌మై గొడ‌వ ప‌డుతుంటే… కేంద్ర‌ప్ర‌భుత్వం మాత్రం సినిమా చూస్తున్న‌ట్టు నిమ్మ‌కు నీరెత్తిన చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.