తెలంగాణ జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలు రోజుకు ఒక్క ట్వీస్ట్ ను తలపిస్తున్నాయి. మునుగోడులో యుగతులసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న శివ కుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించినట్లే కేటాయించి తర్వాత రద్దు చేసి బేబీ వాకర్ ఇవ్వడంతో తీవ్ర దుమారం చేలరేగడంతో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.
మునుగోడు ఉప ఎన్నిక ఆర్వోగా ఉన్న జననాథ రావు ను తప్పించి ఆయన స్ధానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే విషయంలో చేలరేగిన వివాదంతో జగన్నాథ రావును బాధ్యతల నుంచి తొలగించింది.
రిటర్నింగ్ ఆఫీసర్ను బదిలీ చేయడం మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమనీ, బీజేపీ పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కాణమన్నారు.
కాగా టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలి రోడ్డు రోలర్ ఉండటం వల్ల ఇప్పటికై గతంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు చాల నష్టం జరిగింది. దాంతో టీఆర్ఎస్ కంప్లంట్ ఇవ్వడంతో శివకుమార్ కు కేటాయించిన గుర్తును రద్దు చేస్తూ వేరే గుర్తు ఇవ్వడంతో సీఈసీ సీరియస్ అయ్యింది. సీఈసీ ఆదేశాలతో శివకుమార్ కు మళ్లీ రోడ్డు రోలర్ గుర్తు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయాలని ఆదేశించింది. గుర్తులు ఎందుకు మార్చారో రిటర్నింగ్ అధికారిని వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది.