పవన్ పట్టించుకోవడం మానేశాడు

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని పట్టించుకుంటారో, ఎప్పుడు ఎవరు ఎవరిని దూరం పెడతారో చెప్పలేం. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఏ పార్టీలోనైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు శాశ్వతంగా అదే పార్టీలో ఉంటారని చెప్పలేం. గత…

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని పట్టించుకుంటారో, ఎప్పుడు ఎవరు ఎవరిని దూరం పెడతారో చెప్పలేం. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఏ పార్టీలోనైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు శాశ్వతంగా అదే పార్టీలో ఉంటారని చెప్పలేం. గత ఎన్నికల్లో ఏపీలో జనసేన పార్టీ ఒకే ఎమ్మెల్యేను గెలుచుకుంది. తాను రెండు స్థానాల్లో ఓడిపోయినా ఒక్క ఎమ్మెల్యే సీటైనా దక్కిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాగా సంతోషించాడు.

కానీ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏడాది తిరగకముందే అధికార వైసీపీ వైపు తిరిగిపోయాడు. పేరుకు జనసేన ఎమ్మెల్యే. కానీ పార్టీతోగాని, పవన్ తో గాని ఆయనకు సంబంధంలేదు. ఏ పార్టీలోనైనా సరే ఏవో కారణాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు.  కానీ వారు అధికారికంగా తాము గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. రాజ్యసభ ఎన్నికల్లో, మండలి ఎన్నికల్లో  వారు ఎన్నికైన పార్టీ విప్ జారీ చేస్తుంది. అంటే మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయకూడదని, తాను గెలిచిన పార్టీకే ఓటు వేయాలని అర్థం.

ఏపీలో తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు టీడీపీకే ఓటు వేశారు. ఎందుకంటే పార్టీ వారికి విప్ జారీ చేసింది. సరే.. అసమ్మతి ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేసినా అవి చెల్లుబాటుకాని విధంగా వేశారనుకోండి. అది వేరే విషయం. అయితే జనసేన పార్టీ తన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు విప్ జారీ చేయలేదు. వాస్తవానికి విప్ జారీ చేయాల్సిన అవసరం లేదు.

టీడీపీ జనసేన మద్దతు కోరి ఉంటే పవన్ కళ్యాణ్ విప్ జారీ చేసేవాడేమో. కానీ నీ ఇష్టం వచ్చిన పార్టీకి వేసుకో అన్నట్లుగా వదిలేశాడు. తనకు విప్ జారీ కాలేదు కాబట్టి వైసీపీకి ఓటు వేశానని రాపాక చెప్పాడు. తాను ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానని. కాని నిధులకోసం అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పాడు. తనను కావాలనే దూరం పెట్టారు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదన్నాడు రాపాక.

పవన్ కళ్యాణ్ తనను ఎప్పుడూ పక్కన పెట్టుకోలేదని, ఇందుకు తానేమీ బాధపడలేదని అన్నాడు. తాను జనసేన పార్టీని ఎప్పుడూ విమర్శించలేదని, తన పని తాను చేసుకుంటూ పోతున్నానని చెప్పాడు. మొత్తం మీద తన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే సంగతిని పవన్ ఏనాడో మర్చిపోయాడు. జనసేనకు భవిష్యత్తు లేదని గతంలో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు రాపాక. వాస్తవానికి రాపాకకు అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యే అనిపించుకోవాలని ఉంది.

కానీ వైసీపీ నిబంధన ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి. అలా చేసినప్పుడు గెలవకపోతే ఏంటి పరిస్థితి ? టీడీపీకి దూరంగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటమి భయంతోనే పదవులకు రాజీనామా చేయకుండా కథ నడిపిస్తున్నారు. రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచిన చాలా కొద్ది కాలానికే జగన్ కు సలాం కొట్టాడు.

అధినేత పవన్ కళ్యాణ్ బయట అధికార పార్టీ మీద, ప్రభుత్వం మీద మండిపడుతుంటే. రాపాక అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కు భజన చేశాడు. మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే మొదలు పెట్టిన భజన ఇప్పటివరకు ఆపలేదు. 

చైనాకి బుద్ధి చెబుదాం

మనది గొప్ప దేశం.. చైనాకి బుద్ధి చెబుదాం