ప్రభాస్ లుక్ వస్తోంది

బాహుబలి ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాథేశ్వామ్. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి ఏదీ అఫీషియల్ గా ఇప్పటి వరకు బయటకు రాలేదు. జాను అన్నది టైటిల్ అనుకుంటే అది దిల్ రాజు తీసేసుకున్నారు.…

బాహుబలి ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాథేశ్వామ్. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి ఏదీ అఫీషియల్ గా ఇప్పటి వరకు బయటకు రాలేదు. జాను అన్నది టైటిల్ అనుకుంటే అది దిల్ రాజు తీసేసుకున్నారు. దాంతో ఆల్టర్ నేటివ్ టైటిళ్లుగా ఓ మై డియర్, రాథేశ్వామ్ పేర్లు వినిపించడం ప్రారంభించాయి. అంతకు మించి ఆ సినిమా గురించి అప్ డేట్ లేదు. డైలీ ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ రిక్సెస్ట్ చేస్తున్నారు. కొందరు సతాయిస్తున్నారు. కొందరు తిడుతున్నారు కూడా. 

అయినా యువి సంస్థ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే నిజానికి ఇటీవల విడుదలచేయాలనే ఆలోచనతో ఓ స్టిల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. కానీ అదే సమయంలో బాలీవుడ్ లో సుశాంత్ మరణం సంభవించడంతో ఆగిపోయారని బోగట్టా. అందువల్ల మరో డేట్ చేసి విడుదల చేయాలని అనుకంటున్నట్లు తెలుస్తోంది.

బహుశా 22న లేదా కాస్త అటు ఇటుగా ప్రభాస్ లుక్ వస్తుందని తెలుస్తోంది. ఈ లుక్ తో పాటే టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా వుండొచ్చని బోగట్టా. ప్రభాస్ ప్రస్తుతం రెండుసినిమాలు కమిట్ అయి వున్నారు. ఒకటి యువి నిర్మాణంలో రాథేశ్వామ్, వైజయంతీ నిర్మాణంలో నాగ్ అశ్విన్ డైరక్షన్ లో మరో భారీ సినిమా. ఈ రెండూ కాక ఆయన మైత్రీ మూవీస్ కు, అలాగే దిల్ రాజుకు సినిమాలు భవిష్యత్ తో చేయాల్సి వుంది. 

చైనాకి బుద్ధి చెబుదాం