పూరి జగన్నాధ్ గొప్పోడు

గీత గోవిందం బ్లాక్ బస్టర్. కానీ డైరక్టర్ పరుశురామ్ సినిమా ఇఫ్పటి వరకు పట్టాలు ఎక్కలేదు. భరత్ అనే నేను సూపర్ హిట్. కానీ కొరటాల శివ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. రంగస్థలం…

గీత గోవిందం బ్లాక్ బస్టర్. కానీ డైరక్టర్ పరుశురామ్ సినిమా ఇఫ్పటి వరకు పట్టాలు ఎక్కలేదు. భరత్ అనే నేను సూపర్ హిట్. కానీ కొరటాల శివ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. రంగస్థలం సూపర్ డూపర్ హిట్. అయినా సుకుమార్ సినిమా అనేది ఎప్పుడో ఎవరికీ తెలియదు. భాగమతి హిట్ సినిమా. డైరక్టర్ అశోక్ ఏం చేస్తున్నారో తెలీదు. హిందీ సినిమా ప్లానింగ్ లో వున్నారని టాక్ మాత్రం వుంది.

ఆర్ ఎక్స్ 100 కలెక్షన్ కింగ్ అనిపించుకున్న సినిమా. కానీ డైరక్టర్ అజయ్ భూపతి సినిమా ఇప్పటికీ సార్ట్ కాలేదు. గూఢచారి హిట్. డైరక్టర్ శశికిరణ్ ఎక్కడ? హలోగురూ ప్రేమకోసమే? మంచి సినిమా అనిపించుకుంది. కానీ డైరక్టర్ త్రినాధరావు నక్కిన..తరువాత సినిమా ఏంటీ? వీరుగాక యావరేజ్ సినిమానో, ఓ ఫ్లాపునో ఇచ్చిన మంచి డైరక్టర్లు చాలామంది వున్నారు. బోయపాటి శ్రీనివాస్, మేర్లపాక గాంధీ, కళ్యాణ్ కృష్ణ, వక్కంతం వంశీ, చందుమొండేటి ఇలా చాలా జాబితా వుంది.

కానీ ఎవ్వరికీ సినిమాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. పోనీ అలా అని నిర్మాతలు లేరా అంటూ రెడీగా వున్నారు. సమస్య అంతా హీరోలతోనే. అలా అని హీరోలకు కొదవా? అంటే అదీకాదు తెలుగునాట వున్నంత మంది హీరోలు మరే భాషలోనూ లేరు.

కానీ సమస్య అంతా ఏం చేయాలి? ఎవరితో చేయాలి? ఏం చేస్తే చూస్తారు? ఎవరితో చేస్తే చూస్తారు? ఇలా రకరకాల మీమాంసలు. అందువల్ల ఏ ప్రాజెక్టు కూడా అంత సులువుగా ఎక్కడం లేదు. హీరోలు ప్రాజెక్టులు సెట్ చేసుకోవడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. చాలా ముందు వెనుకలు ఆడుతున్నారు.

ఇలాంటి టైమ్ లో ఇలా హిట్ కొట్టి, అలా విజయ్ దేవరకొండ డేట్లు పట్టి, మరో రెండు మూడు నెలల్లో సినిమాను సెట్ మీదకు తీసుకెళ్తాడు అంటే పూరి జగన్నాధ్ టాలెంట్ నే టాలెంట్. డైరక్టర్ గానే సినిమాలు రావడంలేదు అంటే, నిర్మాతగా కూడా ఆయనకే అంటే ఇంకా టాలెంట్ అన్నమాట.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..