టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలయిక ఈ ఇరు పార్టీల కంటే బీజేపీకి ఇబ్బందులు వస్తున్నాయి. పవన్, చంద్రబాబు కలయికపై బీజేపీ అధిష్టానికి రిపోర్టు ఇచ్చిన తర్వాత విజయవాడకు వచ్చిన సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ పవన్, చంద్రబాబు భేటిపై అసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలయిక స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. కలవడంలో తప్పేం లేదని, కంగారు పడాల్సిన పని లేదన్నారు. ఇప్పటికి కూడా బీజేపీ- జనసేన కలిసి వెళ్తామన్నారు. టీడీపీతో జత కట్టే ప్రసక్తినే లేదన్నారు. వైసీపీ- టీడీపీ సమాన దూరంలో ఉండబోతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షులను ఏ పార్టీ నాయకులు అయిన కలవచ్చన్నారు. అమిత్ షా పై రాళ్లు వేసిన చరిత్ర చంద్రబాబు కూడా ఉందన్నారు
అలాగే మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అసంతృప్తి అంశంపై నో కామెంట్ అంటూనే ఏమైనా సమస్యలు ఉంటే హైకమాండ్ చూసుకుంటుందంటూన్నారు. పవన్ కి మా పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని వారు చూసుకుంటారంటూ దాటి వేశారు.
బహుశా ఇవాళ సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టి అధిష్టానం నుండి ఎటువంటి సూచనలు వచ్చాయి అనేది తెలియజేయబోతున్నట్లు తెలుస్తుంది. ఒక వర్గం బీజేపీ నేతలు ఉంటే జనసేనతో ఉండాలి లేకపోతే సింగిల్ గా పోరాటం చేయాలని, మరో వర్గం నేతలు మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ తో కలిసి వెళ్లలాని చూస్తున్నారు.