లైగర్ సినిమా పరాభవం పురిటికంపు దర్శకుడు పూరి జగన్నాధ్ ను అంత త్వరగా వదిలేలా లేదు. పూరి డబ్బులు వెనక్కు ఇచ్చేస్తున్నారహో అంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. దాంతో సూపర్ అని అనుకున్నారు బయ్యర్లు అందరూ. ఈ లోగా జిఎస్టీ మొత్తాలు రిటర్న్ ఇచ్చారు.
ఇండస్ట్రీలో అది కామన్ ప్రాక్టీస్ నే. ఫ్లాప్ అయిన సినిమాలకు, ఆశించన మేరకు ఆడని సినిమాలకు జిఎస్టీ నిర్మాతే భరించడం అన్నది మామూలే. అయితే ఆ తరువాత నుంచి మరి పూరి వైపు నుంచి కబురు లేదు.
దాంతో బయ్యర్లు కలవరపడుతున్నారు. ఏం చేద్దాం అని వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇంత పోయిన తరువాత ఇక తెగిస్తే మాత్రం పోయేదేముంది..త్వరలో నేను మీడియా ముందుకు వెళ్లాలనుకుంటున్నా అని ఓ బయ్యర్ గ్రేట్ ఆంధ్రతో అన్నారు. ఆసియన్ సునీల్-శిరీష్ ఈ వ్యవహారాన్ని మధ్యవర్తులుగా డీల్ చేస్తున్నారని, త్వరలో వ్యవహారం సెటిల్ అవుతుందని పూరి జగన్నాధ్ సన్నిహితులు చెబుతున్నారు.
మొత్తం మీద లైగర్ వెనక్కు ఇచ్చే వ్యవహారం మాత్రం ఇంకా పూర్తికాలేదు అన్నది క్లారిటీ. వన్స్ అది పూర్తయితే పూరి జగన్నాధ్ తన తరువాత సినిమా మీద కాస్త ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతారు. రామ్ లేదా మెగాస్టార్ చిరంజీవితో పూరి జగన్నాధ్ సినిమా వుంటుందనే టాక్ ఇండస్డ్రీలో వుంది. మెగాస్టార్ అయితే పూరి కి ఇటీవల ఓపెన్ ఆఫర్ నే ఇచ్చారు.