భీమ్లా అడియోకి రికార్డు ప్రైస్

అల వైకుంఠపురములో సినిమా అడియో పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. అప్పటి నుంచి మ్యూజిక్ డైరక్టర్ థమన్ చేసే సినిమాల అడియో రైట్స్ కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.  Advertisement మహేష్ సర్కారు వారి…

అల వైకుంఠపురములో సినిమా అడియో పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. అప్పటి నుంచి మ్యూజిక్ డైరక్టర్ థమన్ చేసే సినిమాల అడియో రైట్స్ కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 

మహేష్ సర్కారు వారి పాట అడియో రైట్స్ నాలుగున్నర కోట్ల కు కాస్త అటు ఇటుగా అమ్ముడు పోయాయి. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారవుతున్న భీమ్లానాయక్ అడియో రైట్స్ అంతకు మించి పలికాయి. అయిదుకోట్ల నాలుగు లక్షల కు అడియో రైట్స్ ను ఆదిత్య సంస్థకు విక్రయించినట్లు తెలుస్తోంది.

భీమ్లానాయక్ కు అధికారికంగా త్రివిక్రమ్ దర్శకుడు కాకపోయినా, ఈ సినిమాను కూడా త్రివిక్రమ్-థమన్ కాంబినేషన్ గానే చూస్తున్నారు. అందుకే ఇంత రేటు పలికింది అనుకోవాలి.  

భీమ్లానాయక్ నాన్ థియేటర్ హక్కుల రూపంలో అరవై నుంచి డెభై కోట్లు రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే హిందీ డబ్బింగ్ కు బేరాలు ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసుకున్నారు. 

మలయాళ సినిమా అయ్యప్పన్ కోషియమ్ ఆధారంగా భీమ్లానాయక్ ను అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్ లో తయారుచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమా ఇది.