ముక్కోణపు ప్రేమకథ..మేఘ

మేఘా ఆకాశ్ కీలకపాత్రలో తయారయిన సినిమా డియర్ మేఘ. సెప్టెంబర్ 3న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసారు.  Advertisement ప్రేమించడం తెలిసినా, ప్రేమలో పడినా, ఆ భావాన్ని వ్యక్తం…

మేఘా ఆకాశ్ కీలకపాత్రలో తయారయిన సినిమా డియర్ మేఘ. సెప్టెంబర్ 3న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసారు. 

ప్రేమించడం తెలిసినా, ప్రేమలో పడినా, ఆ భావాన్ని వ్యక్తం చేయలేని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. తన ప్రేమను తనలో దాచుకుని బాధపడాల్సిందే. 

అలాంట ఓ అమ్మాయి కథే డియర్ మేఘ అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతోంది. ఇద్దరు హీరోలు, ఓ హీరోయిన్ నడుమ సాగే ముక్కోణపు ప్రేమ కథ లేదా పరిస్థితుల రీత్యా చిక్కుపడిన ఇద్దరు యువకుల ప్రేమ కథ అనుకోవాలేమో? మేఘ సరసన అదితిఅరుణ్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. సుశాంత్ రెడ్డి దర్శకుడు. 

మేఘా ఆకాష్ మంచి టాలెంట్ వున్న హీరోయిన్. అయితే ఇంత బరువైన కీలకపాత్ర ఇప్పటి వరకు చేయలేదు. ట్రైలర్‌ చూస్తుంటే టోటల్ సినిమా ఆమె చుట్టూనే తిరిగినట్లు కనిపిస్తోంది. మేఘ కూడా తన ప్రతిభను చూపించినట్లే కనిపిస్తోంది ట్రైలర్‌ చూస్తుంటే.