ఇటీవల ఉప్పెన, మాస్టర్ లాంటి సినిమాలతో తెలుగువారికి కూడా బాగా దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. అతగాడు హీరోగా, శృతి హసన్ జంటగా నటించిన సినిమా 'లాభం'. తొలిసారిగా విజయ్ సేతుపతి సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు.
జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రానికి నెల్లూరు లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాను వినాయకచవితి సందర్భంగా 9న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… 'విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది.
ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదలకావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.