గంటాను ఇక నమ్మాల్సిందేనా?

చంద్రబాబుకు తన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదని ఆ పార్టీతో విభేదిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గట్టిగానే వేసుకున్నారు. బాబు అనుమానం చూపులు ఎపుడూ పార్టీలో నిబధ్ధత కలిగిన  నేతలకు చురకత్తుల్లా వేటాడుతాయని…

చంద్రబాబుకు తన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదని ఆ పార్టీతో విభేదిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గట్టిగానే వేసుకున్నారు. బాబు అనుమానం చూపులు ఎపుడూ పార్టీలో నిబధ్ధత కలిగిన  నేతలకు చురకత్తుల్లా వేటాడుతాయని చాలా మంది నాయకులు అంటారు.

ఇక విశాఖ జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలోనూ టీడీపీ హై కమాండ్ ఎపుడూ అనుమానంగానే చూస్తూ వస్తోంది. తాను పార్టీ మారను, బాబే మా నాయకుడు అని గంటా ఎన్నిసార్లు మీడియా ముందు చెప్పినా అదేంటో ఆయన గురించే అంతా చర్చిస్తారు.

కానీ గంటా మాత్రం కీలకమైన టైంలో ఎపుడూ టీడీపీ వెన్నంటే ఉంటున్నారు. జామ్ యాప్ ద్వారా  మహానాడు నిర్వహిస్తే దానికి గంటా హాజరు అయ్యారు. ఇపుడు ఏకంగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకే ఆయన ఓటు వేసి తన నిజాయతీని,  చిత్తశుధ్ధిని మళ్ళీ చాటుకున్నారు.

గంటా సైలెంట్ వెనక వైలెంట్ ఉందని టీడీపీతో పాటు ఎక్కువగా ఊహించుకునే వారికి గంటా ఇలా సమాధానం చెప్పారనుకోవాలి. మొత్తానికి గంటా నోరు విప్పి మిగిలిన నేతల్లా హడావుడి చేయకపోయినా పసుపు పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకుంటున్నారు. ఆ మాటకు వస్తే ఉత్తరాంధ్రా నుంచి  ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అవుతారు అన్న వార్తలకు కూడా రాజ్యసభ ఎన్నికల తరువాత ఫుల్ స్టాప్ పడిందనుకోవాలేమో.

సరే గంటా వచ్చినా తీసుకోమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పేశారు. తాను టీడీపీలో ఉంటానని గంటా అంటున్నారు. మరి మధ్యన డౌట్లు అన్నీ హై కమాండ్ కే ఉన్నాయేమో. అలాటివి ఏవి ఉన్నా కడిగేసి తుడిచేసుకోవచ్చు అని గంటా సార్  మళ్ళీ క్లారిటీ ఇచ్చేశారు.

మనది గొప్ప దేశం.. చైనాకి బుద్ధి చెబుదాం

చైనాకి బుద్ధి చెబుదాం