ఎడారిలో నీటి చుక్క కోసం బాబు ఆరాటం

“ఈ దాహం తీరనిది.. నీ హృదయం కరగనిది” అంటూ ఓ కవి రాసి పాట ఇప్పుడు అచ్చుగుద్దినట్టు చంద్రబాబుకు సరిపోతుంది. బీజేపీతో దోస్తీ కోసం బాబు తహతహలాడుతున్నారు. అటు కమలనాథుల హృదయం మాత్రం కరగడం…

“ఈ దాహం తీరనిది.. నీ హృదయం కరగనిది” అంటూ ఓ కవి రాసి పాట ఇప్పుడు అచ్చుగుద్దినట్టు చంద్రబాబుకు సరిపోతుంది. బీజేపీతో దోస్తీ కోసం బాబు తహతహలాడుతున్నారు. అటు కమలనాథుల హృదయం మాత్రం కరగడం లేదు. దీన్నే విశ్లేషణకులు ఎడారిలో నీటి చుక్క కోసం బాబు ఆరాటపడుతున్నాడంటూ విశ్లేషిస్తున్నారు.

నిజమే.. ఇప్పట్లో టీడీపీని కమలనాథులు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇది పూర్తిగా బాబు స్వయంకృతాపరాథం. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే మెంటాలిడీ ఉన్న చంద్రబాబు.. బీజేపీని కూడా అలా “యూజ్ అండ్ థ్రో” పాలసీ కిందే చూశారు. అది కాస్తా బూమరాంగ్ అయింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుకు తను చేసిన తప్పు తెలిసొచ్చింది.

బాబు పరాభవానికి ఈమధ్యే ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో బీజేపీకి దగ్గరవ్వడానికి బాబు చేయని ప్రయత్నం లేదు. కేంద్రం చేసిన ప్రతి పనిని మెచ్చకుంటూ వచ్చారు. లాక్ డౌన్ టైమ్ లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ప్రపంచం మొత్తం తిడితే, బాబు మాత్రం వెనకేసుకొచ్చారు. దీంతో బీజేపీ కోసం బాబు ఎంతలా అర్రులు చాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు, ఏకంగా తన రాజ్యసభ టీమ్ నే బీజేపీకి అంకితం చేసిన మహానుభావుడు ఈయన.

అయితే అధికారంలో లేకపోయినా బాబు ఇదంతా ఎందుకు చేస్తున్నాడనే అనుమానం చాలామందికి కలగొచ్చు. అధికారంలో లేడు కాబట్టే బాబుకు ఇప్పుడు కేంద్రం అండ అత్యవసరం. ఎందుకంటే ఈయన చేసిన అవినీతి కార్యకలాపాలు అలాంటివి. పోలవరం నిధుల్ని ఏటీఎంలా వాడుకున్నారంటూ స్వయంగా గతంలో ప్రధాని మోడీ విమర్శించారంటే బాబు కరప్షన్ ను అర్థంచేసుకోవచ్చు. ఈ అవినీతి తీగను ఇప్పుడిప్పుడే లాగడం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి జగన్. ఏ క్షణానైనా డొంక కదలొచ్చు.

అదే ఇప్పుడు బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే ఈ ఎడారిలో నీటి చుక్క కోసం ప్రయత్నం. బీజేపీ కోసం పాకులాట. అటు బీజేపీ నుంచి మాత్రం కనీసం ఒక్క శాతం కూడా సానుకూలత లభించడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు బీజేపీ బద్ధ వ్యతిరేకి. కాబట్టి తనకు స్నేహ హస్తం అందిస్తుందనేది బాబు భ్రమ. కానీ బీజేపీలో అంత అమాయకులు ఎవ్వరూ లేరు. స్వయంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.. టీడీపీతో సంబంధాలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. అంతేకాదు, ఆయన కేసుల్ని ప్రస్తావించడం విశేషం. చంద్రబాబు తన కేసులపై స్టేలు తెచ్చుకుంటారని, పైకి మాత్రం నిజాయితీపరుడ్ని అన్నట్టు కలరింగ్ ఇచ్చుకుంటారని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. అరెస్టులు కాకుండా తప్పించుకోవడానికి స్టేలు తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు.

స్వయంగా రామ్ మాధవ్ తో పాటు బీజేపీకి చెందిన మరికొందరు నేతలు అరెస్టులు, బెయిల్ అంటుంటే బాబుకు చెమటలు పడుతున్నాయి. దీంతో ఆయన బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎడారిలో నీటి చుక్క కోసం బాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీ మనసు కరిగేలా లేదు. పైగా వాళ్లకు బాబుతో అస్సలు పని లేదు.

మనది గొప్ప దేశం.. చైనాకి బుద్ధి చెబుదాం

చైనాకి బుద్ధి చెబుదాం