సోనియా గాంధీ స్థానంలో ఎవ‌రు?

24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతను గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఇవాళా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. సోమవారం అధ్య‌క్ష ఎన్నిక‌లు జరగగా ఈరోజు ఫలితాలు వెల్లడించ‌బోతున్నారు. దేశవ్యాప్తంగా పోలైన దాదాపు 9500…

24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతను గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఇవాళా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. సోమవారం అధ్య‌క్ష ఎన్నిక‌లు జరగగా ఈరోజు ఫలితాలు వెల్లడించ‌బోతున్నారు. దేశవ్యాప్తంగా పోలైన దాదాపు 9500 ఓట్లను ఈరోజు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో లెక్కించి, సాయంత్రం లోగా అధ్యక్ష ఫలితాలు వెల్ల‌డించ‌నున్నారు.

కాగా పొటీలో ఉన్న మ‌ల్లికార్జున ఖ‌ర్గే గాంధీ కుటుంబం యొక్క అనాధికార అభ్య‌ర్ధి అభ్య‌ర్ధి గా ప‌రిగ‌ణించ‌బ‌తుండ‌గా, మ‌రో అభ్య‌ర్ధి శ‌శి ధ‌రూర్ త‌న‌కు తాను పార్టీ అభ్య‌ర్ధిగా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డారు. ఎక్కువ శాతం విజ‌యం ఖ‌ర్గే వైపు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. 137 ఏండ్ల కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ చరిత్రలో అధ్యక్ష పదవికి ఆరుసార్లు మాత్రమే ఎన్నిక జరుగడం విశేషం.

సీనియ‌ర్ నేత అయిన ఖ‌ర్గే విజ‌యం దాదాపు ఖాయం అంటూన్నారు కాంగ్రెస్ శ్రేణులు. కానీ ఎంత శాతం మంది ఓట్లు వ‌చ్చాయి అనేది చూడాలి. ఎందుకంటే ఖ‌ర్గే ఓటు దాదాపు గాంధీ కుటుంబానికి ప‌డిన‌ట్లే. ఖ‌ర్గే ప‌గ్గాలు తీసుకున్న త‌ర్వాత‌ కాంగ్రెస్ లో ఎటువంటి మార్పులు జ‌రగ‌బోతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎదురు చూస్తున్నారు.