రాజ‌కీయాల్లోకి మ‌రో హీరో!

త‌మిళ రాజ‌కీయాలకు చిత్ర రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. త‌మిళ రాజ‌కీయాల్లో సినిమా రంగం నుంచి వెళ్లిన వాళ్లు చురుకైన పాత్ర పోషించారు. ఎమ్జీఆర్‌, క‌రుణానిధి, జ‌య‌ల‌లిత‌…వీళ్లంతా వెండితెర‌పై న‌టులుగా, రైట‌ర్స్‌గా ప్ర‌తిభ…

త‌మిళ రాజ‌కీయాలకు చిత్ర రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. త‌మిళ రాజ‌కీయాల్లో సినిమా రంగం నుంచి వెళ్లిన వాళ్లు చురుకైన పాత్ర పోషించారు. ఎమ్జీఆర్‌, క‌రుణానిధి, జ‌య‌ల‌లిత‌…వీళ్లంతా వెండితెర‌పై న‌టులుగా, రైట‌ర్స్‌గా ప్ర‌తిభ క‌న‌బ‌రిచి, అనంత‌రం ముఖ్య‌మంత్రులుగా ప‌ని చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా చాలా మంది చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి రాజ‌కీయాల్లోకి కొన‌సాగుతున్నారు.

క‌మ‌ల‌హాస‌న్‌, ర‌జినీకాంత్‌, ఖుష్భూ…ఇలా ఎంత మంది పేర్లైనా చెప్పొచ్చు. తాజాగా ఈ జాబితాలో ప్ర‌ముఖ హీరో విజయ్ పేరు వినిపిస్తోంది. ఈ నెల 22న విజ‌య్ పుట్టిన‌రోజు. అయితే క‌రోనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఎవ‌రూ నిర్వ‌హించొద్ద‌ని విజ‌య్ త‌న అభిమానుల‌కు పిలుపునిచ్చారు.

కానీ  మధురై లోని విజయ్‌ అభిమానుల తీరే వేరు.  మదురై జిల్లాలో విజయ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని పోస్టర్లను విడుదల చేశారు. ఆ పోస్టులు  వాడవాడలా గోడలపై ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.  ఆ పోస్టులపై తమిళ్‌ మాట్లాడుతూ మోటు శివాజీ గణేషన్, కమల్‌ హాసన్‌ సరసన విజయ్‌ ఫొటోను ముద్రించారు. ఇక్క‌డే విజ‌య్ సినీ రంగ ప్ర‌వేశంపై అనుమానాలు తలెత్తాయి.

విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వెల్లడిస్తారని, ఇంత కాలంగా మౌనం పాటిస్తున్న కొన్ని విషయాలపై త‌న వైఖ‌రిని కుండ‌ బద్ధలు కొడుతార‌ని అందులో స్ప‌ష్టం చేశారు. దీంతో విజ‌య్ రాజ‌కీయ ప్ర‌వేశంపై త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

విజయ్‌ తన చిత్రాల్లో ప్రభుత్వ విధానాలను తూర్పార‌ప‌డుతుంటారు.  విజ‌య్‌కు సంబంధించిన సర్కార్‌ చిత్రం విడుదల సాయం పెద్ద సమస్యే తలెత్తింది. అంతేకాదు ఆయ‌న‌కు సంబంధించి ఇళ్ల‌తో పాటు కార్యాల‌యాల్లో ఐటీ దాడులు, పెద్ద ఎత్తున న‌గ‌దు స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం క‌క్ష‌క‌ట్టింద‌ని విజ‌య్ ఆరోపించారు.  ఈ నేప‌థ్యంలో త‌న పుట్టిన రోజు ఏం బాంబు పేల్చుతారోన‌నే ఉత్కంఠ నెల‌కుంది. 

నేను జిప్ తీసినట్టు నిరూపించండి

ఎన్టీఆర్ ఆత్మ యనమలని క్షమించదు