నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఆసియన్ సునీల్ నారంగ్ ను కొత్త పదవి వరించింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. 2021-23 మధ్య రెండేళ్ల పాటు ఆయన అధ్యక్షుడిగా వుంటారు.
ఇప్పటి వరకు ఇదే సంఘానికి ఆయన కార్యదర్శిగా వుంటూ వచ్చారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ జనరల్ బాడీ మీటింగ్ శనివారం జరిగింది. ఈ మీటింగ్ అనంతరం రాబోవు రెండు సంవత్సరాలకు( 2021-23) కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ కార్యవర్గంలో ప్రెసిడెంట్ – సునీల్ నారంగ్, వైస్ ప్రెసిడెంట్స్ – బాలగోవింద్ రాజ్ తడ్ల.. వి.ఎల్.శ్రీధర్, ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్) కార్యదర్శిగా – కె.అనుపమ్ రెడ్డి సంయుక్త కార్యదర్శి – జె.చంద్రశేఖర్ రావు, కోశాధికారి – ఎం.విజేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ కి బి.లింగం గౌడ్, పి.సుబ్రమణ్యం, డి.విష్ణు మూర్తి, రవీంద్ర గోపాల్, జి.శ్రీనివాస్, బి.సత్యనారాయణ గౌడ్, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల రమేశ్ , బి.విజయ్ కుమార్, కె.ఉదయ్ కుమార్ రెడ్డి, ఎం.నరేందర్ రెడ్డి, ఎం.మోహన్ కుమార్, కె.అశోక్ కుమార్ ఎన్నికయ్యారు.