హీరోయిన్ సమంత ఇన్ స్టా పోస్టులు చిత్రంగా వుంటున్నాయి ఈ మధ్యన. ఆమె వ్యక్తిగత జీవితం మీద పలు గ్యాసిప్ లు వినిపిస్తున్న నేపథ్యంలో సమంత పోస్టులకు కొత్త అర్థాలు వెదుకుతున్నారు నెటిజన్లు.
మొన్నటి మొన్న ఓ పప్పీ ఫోటో పెట్టి 'నువ్వయినా నాతో వుండు ఎప్పటికీ' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ జోడించింది. లేటెస్ట్ గా అబ్దుల్ కలాం పిక్ పెట్టి, ఓ కొటేషన్ వుంచింది.
''నిన్ను ఎవరు బాధపెట్టారు అనే ప్రశ్న…నా స్వంత అంచనాలు…అనే జవాబు' అక్కడ ప్లేస్ చేసింది. తన అంచనాలు రాంగ్ అయ్యాయని, సమంత బాధపడుతోందా? అన్నది ఓ అనుమానం.
ఇదిలావుంటే ఇన్ స్టా స్టేటస్ లోనే పోస్ట్ చేసిన రీల్స్ వీడియలో ఓ చిలుక, కిటికీ తలుపు తడుతూ మమ్మీ..మమ్మీ అంటూ వుంటుంది. అంటే సమంత కూడా స్వంత ఇంటి తలుపు తట్టబోతోందా? అనే అనుమానం…మొత్తానికి నిత్యం తనపై వినిపిస్తున్న గ్యాసిప్ లకు రిలేట్ అయ్యేలా పోస్ట్ లు పెట్టడం ద్వారా సమంత మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.