చెప్పుతో కొట్టడమంటే అదీ పవన్…

చెప్పుతో కొడతాను అంటూ ఏ రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ కూడా అనని అనలేని మాటలతో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ కి చెప్పుతో జనాలు ఎపుడో కొట్టారు అంటూ గట్టి రిటార్ట్ ఇచ్చారు మంత్రి గుడివాడ…

చెప్పుతో కొడతాను అంటూ ఏ రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ కూడా అనని అనలేని మాటలతో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ కి చెప్పుతో జనాలు ఎపుడో కొట్టారు అంటూ గట్టి రిటార్ట్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమరనాధ్. నీకే చెప్పులు ఉన్నాయా మాకు లేవా చెప్పులు అంటూ గట్టిగానే నిగ్గదీశారు. ప్రజాస్వామ్యంలో దాడులు చెప్పులతో కొట్టుకోవడాలు ఉండవు అంటూ సేనానికి సుద్దులు చెప్పారు.

అసలు చెప్పుతో కొట్టడం అంటే ఏంటో తెలుసా పవన్ .. గాజువాక, భీమవరంలలో రెండు చోట్లా నిన్ను జనాలు ఓడించి కూర్చోబెట్టారే దాన్నే చెప్పుతో కొట్టడం అంటారు అని గుడివాడ ఇచ్చిన ఆన్సర్ ఒక లెవెల్ లో ఉందంటున్నారు. తనకు కులం లేదంటూ పదే పదే వల్లించే పవన్ ఏ కులంలో తెలియదు కానీ ఆయన చంద్రబాబుకు అనుకూలం అంటూ పంచ్ డైలాగులను గుడివాడ పేల్చారు.

మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా విశాఖలో మా మంత్రుల మీద జనసేన కార్యకర్తలు దాడులు చేస్తే గాయాలు అయిన వారికి ఎక్కడైనా పరామర్శ ఉంటుందని, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ణి చంద్రబాబు పరామర్శించడమేంటి అంటూ గుడివాడ విమర్శించారు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ తాను ప్యాకేజీ స్టార్ ని కాదని చెప్పి గంట కూడా గడకముందే బాబుతో భేటీ అయ్యారని, మరి ఇపుడు ఏం చేయాలని గుడివాడ ప్రశ్నించారు. పీకే అంటే ప్యాకేజి కళ్యాణ్ అని తానుగానే రుజువు చేసుకున్నారని గుడివాడ చెడుగుడే ఆడేశారు.

పవన్ చంద్రబాబు బంధం ఇంతకాలం ఇల్లీగల్ అని ఇపుడు అది లీగల్ అయిందని గుడివాడ అంటూ మీ ఇష్టం ఇపుడు ఎక్కడ తిరిగినా కలిసినా ఎవరికీ అభ్యంతరం లేదని, జనాలను మాత్రం మభ్యపెట్టకుండా మీ పొత్తులేవో మీరు చూసుకోండని సూచించారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది వైసీపీ సర్కారే అని ఆయన చెప్పారు. పవన్ చంద్రబాబు తో పాటు ఎన్ని పార్టీలను కలుపుకున్నా గెలిచేది వైసీపీయే అని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పారు.