ద‌త్త‌పుత్రుడు.. స‌న్నాసిన్న‌ర స‌న్నాసి

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పారు మాజీ మంత్రి పేర్నినాని. నీవు ఒక చెప్పు చూపిస్తే మేము రెండు చెప్పులు చూపిస్తామ‌ని, నీవు ఒక మాట అంటే…

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పారు మాజీ మంత్రి పేర్నినాని. నీవు ఒక చెప్పు చూపిస్తే మేము రెండు చెప్పులు చూపిస్తామ‌ని, నీవు ఒక మాట అంటే మేము వంద మాట‌లు అంటామని వార్నింగ్ ఇచ్చారు.

ఎవ‌రైనా రాజ‌కీయ పార్టీ పెట్టి ఎక్క‌డ పోటీ పెట్ట‌కుండా వేరే వాళ్ల‌కు ఓటేయ‌మని చెప్ప‌డం ఒక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే సాధ్యమ‌న్నారు.

జ‌న‌సేన పార్టీ అనేది రాజ‌కీయ పార్టీ కాద‌ని జ‌న‌సేన అనేది ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ అని దాని అంతిమ ల‌క్ష్యం చంద్ర‌బాబు నాయుడుకి ల‌బ్ధి చేకూర్చడమేన‌న్నారు.

ఇవాళ ద‌త్త‌పుత్రుడి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముసుగు తొల‌గిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా జ‌న‌సేన పోటీ చేయ‌కుండా టీడీపీ కోసం పని చేస్తుంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని నియోజకవర్గల్లో జ‌న‌సేన పోటీ చేస్తే ఫ్యాకేజీ స్టార్ అన్న‌మని తేల్చి చెప్పారు.

ఏపీలో రేప‌ట్నుంచి రాజ‌కీయలు మారుతాయన్న ప‌వ‌న్ వ్యాఖ్య‌లు నిజం అయ్యేలాగా బీజేపీతో పవన్ తెగదెంపులు చేసుకోని టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నారన్నారు. ఇప్ప‌టికైనా రాజ‌కీయాల్లో ఎలా ఉండాలో తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.