ప‌వ‌న్ అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డిందా!

మొత్తానికి పవన్ అసలు రంగు త‌న‌కు తానే బ‌య‌ట‌పెట్టుకున్నారు. ఒక రాజ‌కీయ నాయడుకు మాట్లాడ‌ని మాట‌లు మాట్లాడి తాను నిజంగా రాజ‌కీయ నాయ‌కుడు కాద‌ని నిరూపించుకున్నారు. త‌న పార్టీ అఫీసులో త‌న కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ప్ప‌ట్లు…

మొత్తానికి పవన్ అసలు రంగు త‌న‌కు తానే బ‌య‌ట‌పెట్టుకున్నారు. ఒక రాజ‌కీయ నాయడుకు మాట్లాడ‌ని మాట‌లు మాట్లాడి తాను నిజంగా రాజ‌కీయ నాయ‌కుడు కాద‌ని నిరూపించుకున్నారు. త‌న పార్టీ అఫీసులో త‌న కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవడానికో తెలియ‌లేదు కానీ త‌న ప్ర‌త్య‌ర్ధుల‌ను చెప్పు చూపిస్తూ, ప్యాకేజ్ స్టార్ అనే వారిని మెడ పిసికి చంపేస్తా అంటూ రెచ్చిపోయారు. త‌ను సినిమాలో నటిస్తున్నానని అనుకున్నారో ఏమో కానీ వీరావేశంతో ఊగిపోయారు.

రాజ‌కీయాల్లో ఉంటే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. దానీ మ‌ర్చిపోయి ఏదో నోటికి వ‌చ్చిన‌ట్లు బూతులు మాట్లాడితే ప్ర‌త్య‌ర్ధులు సైలెంట్ గా ఉంటారు అనుకోవ‌డం అవివేకం. ఎందుకంటే రాజ‌కీయాలు అంటేనే విమ‌ర్శ‌లు కామ‌న్. ఒక విధంగా చెప్పాలంటే వైయ‌స్ జ‌గ‌న్ రాజ‌కీయం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుండి ఎల్లో మీడియాలో వ‌చ్చిన‌న్ని వార్త‌లు ఎవ‌రిపైన రాలేదు. కానీ ఏ రోజు వైయ‌స్ జ‌గ‌న్ బూతులు తిట్ట‌లేదు.

షూటింగ్ టైంలో ఖాళీ చూసుకొని రాజ‌కీయం చేసే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలో ఉన్నా, లేక‌పోయిన ఆయన్ను విమ‌ర్శిస్తూ ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబు మ‌నిషి అనే ముద్ర ప‌డింది. క‌నీసం చంద్ర‌బాబుది చిన్న త‌ప్పు కూడా క‌న‌ప‌డ‌లేదా అనేది వైసీపీ నేత‌ల కంటే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల నుండి వ‌స్తున్న మాట‌లే.

ఇప్ప‌టికైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌పై ప‌డినా ముద్రను తొల‌గించుకోవాలంటే ముందుగా టీడీపీతో త‌న బంధాన్ని తొలంగించుకుంటే ఎవ‌రు విమ‌ర్శించరు. కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌జా పోరాటం చేయాల‌ని పిలుపు ఇస్తే పార్టీ ప్రతిష్టం అవుతుంది త‌ప్పా గొడవ‌లు ప‌డండి, కొట్టుకోండి అంటే ప‌వ‌న్ బాగానే ఉంటారు పాపం దాని పాటించిన‌ జ‌న‌సైనికులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.