చెప్పుతో కొడతా నా కొడుకుల్లారాః ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ భాష అదుపు త‌ప్పింది. విశాఖ‌లో ప‌వన్‌క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై సొంత పార్టీ నుంచే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఒక‌వైపు హ‌త్యాయ‌త్నం కింద జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ భాష అదుపు త‌ప్పింది. విశాఖ‌లో ప‌వన్‌క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై సొంత పార్టీ నుంచే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఒక‌వైపు హ‌త్యాయ‌త్నం కింద జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌కు కేసుల‌న్నా, జైలన్నా భ‌యం లేద‌ని నీతుల‌తో కాలం గ‌డ‌ప‌డంపై జ‌న‌సైనికులు మ‌న‌స్తాపం చెందారు. ఆ త‌ర్వాత తీరిగ్గా ఆయ‌న విజ‌య‌వాడ‌కు వెళ్లారు.

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన కార్యాల‌యంలో ఆయ‌న కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోయారు. ఒక ద‌శ‌లో భాష‌పై అదుపు త‌ప్పి… కొడుకుల్లారా, చెప్పుతో కొడ‌తా అంటూ రెచ్చిపోయారు. ప్యాకేజ్ స్టార్ అనే స‌న్నాసి వెధ‌వ‌ల్ని చెప్పుతో కొడ‌తా అంటూ… చేతిలోకి చెప్పు తీసుకుని చూపించారు. మాట మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ‌ని విమ‌ర్శిస్తున్నార‌న్నారు. విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నారా నా కొడుకుల్లారా అని చెల‌రేగిపోయారు. మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండ్రా… ఎవ‌డొద్ద‌న్నార‌ని ప్ర‌శ్నించారు. ఒరేయ్ వెధ‌వ‌ల్లారా నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకురా? అని నిల‌దీశారు.

చ‌ట్ట ప్ర‌కారం వారికి భ‌ర‌ణం చెల్లించాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఒక పెళ్లి చేసుకుని 30 స్టెప్నీల‌తో తిరిగే నా కొడుకుల్లారా రండి తేల్చుకుందామ‌ని స‌వాల్ విసిరారు. ఒక్కో నా కొడుకును ఒంటిచేత్తో మెడ పిసికి చంపేస్తా నా కొడుకుల్లారా అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌పై వైసీపీతో యుద్ధ‌మే అని ఆయ‌న ప్ర‌క‌టించారు. రాడ్ల‌తోనా, హాకీ స్టిక్కుల‌తోనా, దేంతోనైనా రెడీగా ఉన్నాన‌న్నారు. మీరు రెడీనా అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. ఇక మీద‌ట త‌మ‌ను తిట్టే ప్ర‌తి వ్య‌క్తి తోలు తీస్తాన‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

వైసీపీలో అంద‌రూ దుర్మార్గులు ఉంటార‌ని అన‌డం లేద‌న్నారు. నీచుల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌న్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి లాంటి మంచివాళ్లు వున్నార‌న్నారు. బాప‌ట్ల‌లో పుట్టాన‌ని, గొడ్డు కారం తిని పెరిగాన‌న్నారు. ఒంగోలులో చ‌దువుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఆరోప‌ణ‌లు చేస్తే ఇక‌పై స‌హించ‌నని హెచ్చ‌రించారు. ఇంత వ‌ర‌కూ మిమ్మ‌ల్ని త‌మ‌ స‌హ‌న‌మే ర‌క్షించింద‌న్నారు.