పవన్ మంచి నటుడు… కానీ… ?

పవన్ కళ్యాణ్ మంచి నటుడు. అందులో రెండవ మాటే లేదు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఏమీ కారు అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన‌ క్రిష్ణ దాస్. అలుగుటయే ఎరుగని అజాత శత్రువు అనదగిన…

పవన్ కళ్యాణ్ మంచి నటుడు. అందులో రెండవ మాటే లేదు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఏమీ కారు అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన‌ క్రిష్ణ దాస్. అలుగుటయే ఎరుగని అజాత శత్రువు అనదగిన క్రిష్ణ దాస్ పవన్ పైన చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు మంట పుట్టించేలా ఉన్నాయి.

పవన్ రాజకీయాల మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ క్రిష్ణ దాస్ సూచించడమూ విశేషమే. పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయిన సంగతిని గుర్తు చేసిన దాసన్న మీరు జగన్ తో పోల్చుకొవడం తగదంటూ సెటైర్లు వేశారు.

అటు పవన్ కానీ ఇటు లోకేష్ కానీ జగన్ తో సరిపోల్చుకుంటూ కామెంట్స్ చేయడాన్ని ఆయన తప్పు పడుతున్నారు. జగన్ కి జగనే సాటి ఆయన గ్రేట్ లీడర్ అంటూ కితాబు ఇచ్చేశారు దాసన్న.

ఇక అయిన దానికీ కాని దానికీ జగన్ని పవన్, లోకేష్ విమర్శించడాన్ని కూడా ఆయన కూడదు అంటున్నారు. జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా దారుణమని అంటున్నారు. 

ఈ ఇద్దరు నేతలు ఆలోచించి మాట్లాడితే సబబుగా ఉంటుదని ఉప ముఖ్యమంత్రి హోదాలో దాసన్న విలువలైన సలహా ఇచ్చేశారు. మరి దీని మీద పవన్ లోకేష్ ల కౌంటర్లు ఎలా ఉంటాయో చూడాలి.