పోలీసుల అదుపులో బిగ్‌బాస్ ఫేంతో పాటు సినీ సెల‌బ్రిటీలు!

బిగ్‌బాస్ ఫేం హిమ‌జ‌తో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఈ ఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ప‌ట్టుబ‌డిన వారంతా సినీ రంగానికి చెందిన వారు కావ‌డంతో స‌హ‌జంగానే మీడియాలో…

బిగ్‌బాస్ ఫేం హిమ‌జ‌తో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఈ ఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ప‌ట్టుబ‌డిన వారంతా సినీ రంగానికి చెందిన వారు కావ‌డంతో స‌హ‌జంగానే మీడియాలో వైర‌ల్ అవుతోంది. అస‌లేం జ‌రిగిందో తెలుసుకుందాం.

హైద‌రాబాద్ శివార్ల‌లో రేవ్ పార్టీలు జ‌రుగుతున్నాయ‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వీకెండ్స్‌లో న‌గ‌ర శివార్ల‌లోని ఫామ్ హౌస్‌ల‌లో పోలీసుల క‌న్నుగ‌ప్పి రేవ్ పార్టీలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు నిర్వాహ‌కులు పోలీస్ అధికారుల‌కు భారీ మొత్తంలో ముడుపులు ముట్ట‌చెప్పి అసాంఘిక కార్య‌క‌లాపాల‌ను య‌థేచ్ఛ‌గా కొన‌సాగిస్తున్నారు.

ఈ ప‌రంప‌ర‌లో హైద‌రాబాద్ శివార్ల‌లో ఇబ్రహీంప‌ట్నం ఫాం హౌస్‌లో బిగ్‌బాస్ ఫేం హిమ‌జ నేతృత్వంలో రేవ్ పార్టీ నిర్వ‌హిస్తున్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు స‌ద‌రు ఫాం హౌస్‌పై దాడి చేశారు. ఈ సంద‌ర్భంగా హిమ‌జ‌తో పాటు 11 మంది సినీ సెల‌బ్రిటీలు ప‌ట్టుబ‌డిన‌ట్టు వార్త‌లొచ్చాయి. వీళ్లంద‌రిని పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే హిమ‌జ‌తో పాటు ప‌ట్టుబ‌డిన సెల‌బ్రిటీలు ఎవ‌రన్న‌ది తెలియాల్సి వుంది.  

ఇదిలా వుండ‌గా బిగ్‌బాస్ రియాల్టీ మూడో సీజ‌న్‌లో హిమ‌జ కంటెస్టెంట్‌. హిమ‌జ‌…హిమ‌జ అంటూ స‌ర‌దాగా ఆమెని ఆట ప‌ట్టించేవారు. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బ‌య‌టికొచ్చిన త‌ర్వాత ఆమె ఎక్క‌డా పెద్ద‌గా క‌నిపించిన దాఖ‌లాలు లేవు. తాజాగా రేవ్ పార్టీ నిర్వాహ‌కురాలిగా పోలీసుల‌కు ప‌ట్టుబడ‌డంతో వార్త‌ల్లో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.