నిర్మాత…న్యూమరాలజీ

సినిమా జ‌నాలకు, రాజ‌కీయాశ్రితులకు వున్నంత సెంటిమెంట్ లు, నమ్మకాలు మరెవరికి ఉండవేమో? జాతకాలు, నెంబర్లు, అక్షరాలు, ఆఫీసులు ఇలా చాలా అంటే చాలా నమ్మకాలు వుంటాయి. ఎంత పైకి ఎదిగినా అచ్చి వచ్చిన చిన్న…

సినిమా జ‌నాలకు, రాజ‌కీయాశ్రితులకు వున్నంత సెంటిమెంట్ లు, నమ్మకాలు మరెవరికి ఉండవేమో? జాతకాలు, నెంబర్లు, అక్షరాలు, ఆఫీసులు ఇలా చాలా అంటే చాలా నమ్మకాలు వుంటాయి. ఎంత పైకి ఎదిగినా అచ్చి వచ్చిన చిన్న ఇల్లు, ఆఫీసు అయినా అలాగే వుంచుకుంటారు. కార్లకు నెంబర్ల కోసం లక్షలు ఖర్చు చేస్తారు. ఇలా చాలా వుంటాయి వ్యవహారాలు. 

ఇక జ్యోతిష్యాలు, ముహుర్తాల సంగతి సరే సరి. సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి కంటెంట్ విడుదల మీదుగా సినిమా విడుదల వరకు తొమ్మిది టోటల్ వచ్చేలా ముహుర్తాలు వుంటనే వుంటాయి. పైకి చెప్పకపోయినా, తెలియకపోయినా, ఇలాంటి నమ్మకాలు బాగానే వున్న ఓ బడా నిర్మాత ఒకరు వున్నారు. సినిమాకు సంబంధించిన అన్ని రంగాల్లో లీడ్ లో వుంటున్న ఈ నిర్మాత తరచు తనకు నమ్మకం వున్న ఓ న్యూమరాలజిస్ట్ ను సంప్రదిస్తుంటారట.

అయితే ఇటీవల ఆ న్యూమరాలజిస్ట్ సదరు నిర్మాతకు ఓ షాకింగ్ విషయం చెప్పారట. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ లు ఎలా చేసినా ఓకె కానీ ఇకపై మాత్రం తొందరపడి ప్రాజెక్టులు చేయవద్దని, రిస్కీ ప్రాజెక్టులు అసలే చేయవద్దని చెప్పేసారట. ప్రస్తుతం చేతిలో వున్న భారీ ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వుండాలని ఆ న్యూమరాలజిస్ట్ జాగ్రత్తలు చెప్పినట్లు తెలుస్తోంది. 

మరి ఆ న్యూమరాలజిస్ట్ చెప్పినట్లే నడుచుకుంటారో, రిస్క్ చేస్తారో చూడాలి.