మెగాస్టార్ చిరంజీవి మెమరబుల్ సినిమా సైరా. ఆ సినిమా ఓ మైల్ స్టోన్ లా వుండాలని చిరు తనయుడు, నిర్మాత రామ్ చరణ్, మరేమీ ఆలోచించకుండా ఖర్చుచేసి తీసిన సినిమా. అందుకే ఈ సినిమాకు ఇప్పటికి అచ్చంగా 270 కోట్లు ఖర్చయిందట. అయితే ఇందులో చిరంజీవి రెమ్యూనిరేషన్ లేదు. కానీ రికవరీ చూస్తుంటే అంత వస్తుందా? అని అనుమానం కలుగుతోందని తెలుస్తోంది.
ఎంత మార్కెట్ చేసినా, నాన్ థియేటర్ హక్కుల ఆదాయం కలుపుకున్నా, జస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందేమో అని లెక్కలు కడుతున్నారట. కానీ అంత వరకు ఒకె. మరి మెగాస్టార్ రెమ్యూనిరేషన్? అది కనీసం పాతిక నుంచి ముఫై కోట్లు అన్నా యాడ్ చేయాలి కదా?
కానీ ఇప్పటి వరకు నాన్ థియేటర్ హక్కుల డీల్ ఇంకా సెటిల్ కాలేదు. అది ఫైనల్ అయితేనే అన్నీ కలిపి 270 కోట్లు రికవరీ వస్తుందో, రాదో తెలుస్తోంది. 270 వెనక్కు వచ్చేసినా, చిరు రెమ్యూనిరేషన్ వుండదు. అంటే ఆయన తన ఫ్యామిలీ సినిమాలో తను ఫ్రీగా నటించినట్లే అనుకోవాలి.
అయితే సినిమా బడ్జెట్, మార్కెట్, ఎంత వస్తుంది? ఎంత లాస్? ఇవన్నీ తనకు అనవసరం. డాడీకి ఓ మాంచి సినిమా గిఫ్ట్ గా ఇవ్వడమే తనకు కావాలి అంటున్నాడట రామ్ చరణ్. అయినా చిరు, చరణ్, ఉపాసనల స్టామినాకు, బ్యాకప్ కు, ఈ యాభై, వంద కోట్లు అన్నది నథింగ్ అనుకోవాలి.