ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీకి చెందిన రూ 80.65 కోట్లు విలువైన స్ధిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది.
గతంలో బ్యాంకు రుణాలు దారి మళ్లించిన ఆరోపణల మేరకు ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ఖమ్మం, హైదరాబాద్ సహా మొత్తం 6 చోట్ల సోదాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించి పలు అధారాలు సేకరించింది. అలాగే రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎంపీగా పని చేసినా నామా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలుపోందారు. టీడీపీ అధ్యక్షుడికి అత్యంత దగ్గరి సన్నిహితుడుగా పేరు పొందినా నామా ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు.