కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా గాంధీభవన్ లో ఓటు వేసేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికల ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తను మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని తేల్చిచెప్పారు.
తాను మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని, ఎన్నికల ప్రచారానికి హోంగార్డులు వెళ్లరని.. ఎస్పీ స్థాయి నేతలే వెళతారని కామెంట్లు చేశారు. గతంలో కోమటి రెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
వంద కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తా అని చెప్పినా ఆ నేతనే మునుగోడు పార్టీని గెలిస్తారని సెటైర్ వేశారు. అలాగే తను ఎప్పుడు విదేశాలకు వెళ్తున్న అనేది కేటీఆర్ నే అడగాలన్నారు.
ప్రస్తుతం మునుగోడు ఎన్నికల విజయం తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు చాల ఆవసరం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపించాలంటే ఈ ఎన్నికలు తప్పకుండా గెలవాలి. మునుగోడు సీటు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్ధానం కాగ, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరుగుతున్న ప్రచారానికి దూరంగా ఉండటం చూస్తుంటే తమ్ముడి మీద ప్రేమతోనో, లేక పీసీసీ చీఫ్ మీద కొపంతోనో ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు కనపడుతోంది.