ఖర్చు, కాస్టింగ్, ప్రొడక్షన్ వ్యయం సంగతి ఎలా వున్నా రీజనబుల్ రేట్లకు మార్కెట్ చేసిన సినిమా శర్వానంద్ రణరంగం. సుధీర్ వర్మ డైరక్షన్ లో విడుదలయిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తొలిసగం బాగుందని, మలిసగం వీక్ అని, హీరో ఎలివేషన్ బాగుందని, టెక్నికల్ గా ఓకె అని, స్టోరీ మైనస్ అని ఇలా రకరకాలుగా కామెంట్లు వినిపించాయి.
వాటి సంగతి ఎలావున్నా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి ఫలితాలే నమోదు చేసింది. సినిమాను ఆంధ్ర 7 కోట్ల రేషియోలో, సీడెడ్ రెండుకోట్ల ముఫై లక్షలకు, నైజాం నాలుగున్నర కోట్లకు టోటల్ ఎన్ఆర్ఎ చేసారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో టోటల్ దగ్గర దగ్గర 14 కోట్లకు ఇచ్చినట్లు అయింది.
తొలిరోజు 3.83 కోట్లు వసూలు చేసింది. శర్వానంద్ కు ఇది చాలా మంచి ఫిగర్ అనే చెప్పుకోవాలి. సినిమా గురువారం విడుదలయింది కాబట్టి శుక్రవారం మంచి ఫిగర్లు కనిపించకపోవచ్చు, శని, ఆదివారం మళ్లీ చెప్పుకోదగ్గ ఫిగర్లు కనిపించే అవకాశం వుంది. సినిమా శనివారం డ్రాప్ కాకుండా వుంటే ఫస్ట్ వీకెండ్ మంచి ఫలితాలు కనిపించే అవకాశం వుంది.
డే వన్ కలెక్షన్ల వివరాలు
నైజాం………1.41.cr
సీడెడ్……….0.45 (approx share)
వైజాగ్……….0.51
ఈస్ట్…………0.37
వెస్ట్………….0.28
కృష్ణ………….0.24
గుంటూరు…..0.37
నెల్లూరు……..0.20