టాలీవుడ్ లో పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. ఈ లిస్ట్ చెప్పగానే ముందుగా ప్రభాస్, రానా లాంటి హీరోలు గుర్తొస్తారు. ఆ తర్వాత కేటగిరీలో నితిన్, శర్వానంద్ లాంటి హీరోలు కూడా కనిపిస్తారు. శర్వానంద్ కూడా చిన్నోడేం కాదు. 35 ఏళ్లొచ్చాయి. కానీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. గమ్మత్తుగా ఇతడికి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు కూడా తక్కువగానే ఎదురవుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి ప్రశ్నలు కాస్త ఎక్కువగా పడ్డాయి.
రణరంగం ప్రమోషన్ లో భాగంగా వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు శర్వానంద్. ఇందులో భాగంగా తన పెళ్లిపై కూడా రియాక్ట్ అయ్యాడు. అసలు ఇప్పటివరకు ఆ కోణంలో ఆలోచించలేదంటున్నాడు ఈ హీరో. కనీసం తనకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదని చెప్పుకొస్తున్నాడు.
“గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. పెళ్లిపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలు లేవు. ఫిక్స్ అయినప్పుడు ఎనౌన్స్ చేస్తా. ఎలాంటి అమ్మాయి కావాలనే అంశంపై కూడా పెద్దగా ఆలోచించలేదు. ఆ టైమ్ వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా వస్తుంటాయి. పెళ్లి ఎప్పుడనేది త్వరలోనే చెబుతా.”
పెళ్లి ఆలోచన లేదన్న శర్వానంద్.. పెళ్లిపై మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పడం ఆశ్చర్యం. మరోవైపు తనకు నచ్చిన హాలిడే స్పాట్ ఏంటో కూడా చెప్పుకొచ్చాడు. రణరంగం సినిమాను స్పెయిన్ లో ఎక్కువ భాగం షూట్ చేసినప్పటికీ.. తనకు న్యూయార్క్ అంటే చాలా ఇష్టమని, ఎందుకంటే అక్కడ తనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయంటున్నాడు.
“నాకు నచ్చిన హాలిడే స్పాట్స్ చాలా ఉన్నాయి. కానీ న్యూయార్క్ తో ఎక్కువ అనుబంధం ఉంది. ఓ 2 నెలలు టైమ్ దొరికితే న్యూయార్క్ వెళ్లిపోతాను. అక్క ఇంట్లో ఉండను. న్యూయార్క్ లోనే ఇల్లు రెంట్ కు తీసుకొని ఉంటాను. అలా అమెరికా వెళ్లి చాలా రోజులైంది. ఇప్పుడు టైమ్ దొరకడం లేదు.”
ఇండస్ట్రీలో రామ్ చరణ్, రానా తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నాడు శర్వానంద్. చిన్నప్పుడు తామంతా ఒకే స్కూల్ లో చదువుకున్నామని, ముగ్గుర్లో ఎవ్వరూ పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయాం అంటున్నాడు. ఇప్పటికీ తను రెగ్యులర్ గా టచ్ లో ఉండేది వాళ్లిద్దరితోనే అని స్పష్టంచేశాడు.