600 టీఎంసీ నీళ్లు.. మామూలు వరద కాదు!

గత 15 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని, అక్కడ నుంచి దిగువకు వదిలిన నీరు మొత్తం పరిమాణం 600 టీఎంసీలు అని జలవనరుల శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. వీటిల్లో జూరాల ప్రాజెక్టు ద్వారా…

గత 15 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని, అక్కడ నుంచి దిగువకు వదిలిన నీరు మొత్తం పరిమాణం 600 టీఎంసీలు అని జలవనరుల శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. వీటిల్లో జూరాల ప్రాజెక్టు ద్వారా చేరిన నీరు 540 టీఎంసీలు అయితే, తుంగభద్ర ద్వారా చేరిన నీరు 60 టీఎంసీలని ప్రకటించారు. స్థూలంగా శ్రీశైలం ప్రాజెక్టును చేరిన నీరు 600 టీఎంసీలు అని తెలుస్తోంది.

శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కేపాసిటీ 215 టీఎంసీల వరకూ ఉంది. నాగార్జున సాగార్ నిల్వ సామర్థ్యం 312 టీఎంసీల వరకూ ఉంది. ఈ జలాశయాలు దాదాపు గరిష్టమట్టంలో ఉన్నాయి. ఆ స్థాయి నుంచినే నీటి విడుదల సాగుతూ ఉంది.

600 టీఎంసీలలో శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో నిల్వ ఉన్న నీరు దాదాపు ఐదు వందల టీఎంసీలు. ఇక పులిచింతల ప్రాజెక్టులో దాదాపు 40 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజ్ లో మరో మూడు టీఎంసీల నీరున్నాయి. ఆపై ఓవర్ ఫ్లో వాటర్ మాత్రం కడలి వైపు సాగుతూ ఉన్నాయి.

అయితే ఇంకా వరద కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎగువన వరద కొనసాగుతూ ఉంది. ఆల్మట్టి గేట్లు మూసేసే పరిస్థితి లేదు. దీంతో మరికొన్ని రోజుల పాటు వరద కొనసాగే అవకాశాలున్నాయి. నాగార్జున సాగర్ గేట్లను ఎత్తక పది సంవత్సరాలు అయ్యాయి. అలాంటిది ఇప్పుడు మరికొన్ని రోజులు సాగర్ గేట్లు బంద్ అయ్యే అవకాశాలు లేవు. కరువుతీరా, కడలి వైపు సాగే వరద రావడం రైతాంగానికి ఎంతో ఊరటను ఇస్తున్న అంశం.

దేవరకొండ షేక్‌ అయ్యాడు

సినిమా రివ్యూ: ఎవరు   సినిమా రివ్యూ: రణరంగం