బెస్ట్ సీఎం సర్వే.. జగన్ తర్వాతే కేసీఆర్

అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎంతలా అంటే జగన్ కంటే ఎంతో సీనియర్ అయిన పొరుగు రాష్ట్రం మఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ ను బీట్ చేయలేకపోయారు.…

అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎంతలా అంటే జగన్ కంటే ఎంతో సీనియర్ అయిన పొరుగు రాష్ట్రం మఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ ను బీట్ చేయలేకపోయారు. ఈ ఆశ్చర్యకర ఫలితాల్ని వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ ప్రచురించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసి పరిపాలన పట్టాలపైకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రుల పనితీరుపై ఈ సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఏ ముఖ్యమంత్రి పనితీరుతో ఎంతమంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే అంశంపై సర్వే చేసింది. ఈ సర్వేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలవగా.. కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.

లిస్ట్ లో 81 పాయింట్స్ తో నవీన్ పట్నాయక్ మరోసారి మొదటి స్థానంలో నిలవగా.. 72 పాయింట్లతో యోగీ ఆదిత్యనాధ్ రెండో స్థానంలో నిలిచారు. వీళ్లిద్దరి తర్వాత మూడో స్థానంలో 71 పాయింట్లతో నిలిచారు ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు, చేపడుతున్న సంస్కరణలు ఆయనకు ఈ స్థానాన్ని కట్టబెట్టాయి.

ఆగస్ట్ 9 నుంచి 14వ తేదీ వరకు 6 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో 11వేల 252 మంది పాల్గొన్నారు. వీళ్లు చెప్పిన అభిప్రాయాల ఆధారంగా సర్వే ఫలితాల్ని వెల్లడించారు. ఐదో స్థానంలో నిలిచిన కేసీఆర్ కు 65 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఆఖరి స్థానంలో 44 పాయింట్లలో పళనిస్వామి నిలిచారు.

తాజా సర్వేతో ఏపీలో ప్రజలు జగన్ పై ఎంత సంతృప్తికర స్థాయిలో ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ పాలనపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించలేదనే విషయం కూడా ఈ సర్వేతో మరోసారి రుజువైంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వల్లనే జగన్ ఇలా ఉత్తమ ముఖ్యమంత్రిగా దూసుకుపోతున్నారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్ని, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు జగన్. నవరత్నాల అమలు కోసం ప్రతి రోజూ కష్టపడుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే ప్రజామద్దతుతో దూసుకుపోతున్నారు జగన్.

దేవరకొండ షేక్‌ అయ్యాడు

సినిమా రివ్యూ: ఎవరు   సినిమా రివ్యూ: రణరంగం