ఎక్కడైనా అమ్మాయిలపై అబ్బాయిలు ప్రేమ పేరుతో వేధించడం కథలు కథలుగా వింటుంటాం. కానీ జగిత్యాల జిల్లాలో ఇందుకు పూర్తి రివర్స్ స్టోరీ. యువతి వేధింపులు తాళలేక పెళ్లయిన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేశ్‌కు అమ్మాయి రూపంలో చిక్కులొచ్చాయి. ఇతనికి పెళ్లయింది. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ట్యాక్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే మండలంలోని తాటిపల్లికి ఓ యువతి జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది.
ఈ క్రమంలో గణేశ్ ట్యాక్స్‌లో స్వగ్రామానికి వెళ్లి వస్తూ అతనిపై మనసు పారేసుకుంది. ఆ యువకుడినే మనువాడాలని గట్టిగా నిర్ణయించుకుంది. మరోవైపు తనతో చనువుగా మాట్లాడాన్ని స్నేహమని గణేశ్ భావించాడు. కానీ ఆమె మనసులో ప్రేమ భావన ఉందనే విషయాన్ని పసిగట్టలేకపోయాడు.
తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కొన్ని రోజులుగా అతన్ని వేధిస్తోంది. అతను నిరాకరించాడు. ఇతరులతో గణేశ్‌కు ఫోన్ చేయిస్తూ బెదిరింపులకు దిగింది. ఈ నేపథ్యంలో అతను మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు.
కుటుంబ సభ్యులు గుర్తించి జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆ యువతి వేధింపుల నుంచి తనను కాపాడాలని గణేశ్ కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి నోరు తెరిస్తే ఎలాంటి నిజాలు బయటికొస్తాయో అనే ఆసక్తి నెలకుంది. .