టాలీవుడ్ పెద్దలు నలుగురు వస్తే, టికెట్ రేట్లు తదితర సమస్యలపై సిఎమ్ జగన్ మాట్లాడతారని పేషీ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు మెగాస్టార్ ఇంట్లో 'కొంతమంది' పెద్దలతో సమావేశం జరిగింది.
అప్పటి నుంచి జగన్ అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ఆగస్టు మూడో వారంలో వుంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటంటే సెప్టెంబర్ మొదటి వారం వరకు వుండదని.
సిఎమ్ జగన్ ప్రస్తుతం బిజీగా వున్నారు. పైగా అయన తన పెళ్లి రోజు సందర్భంగా పర్సనల్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అందువల్ల ఇప్పట్లో అపాయింట్ మెంట్ ఇచ్చేలా కనిపించడం లేదు.
అదీ కాక అసలు టికెట్ రేట్ల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వం వైపు నుంచి కూడా ఓ క్లారిటీ రావాల్సి వుంది. అది వస్తే, టాలీవుడ్ పెద్దల ముందు ఆ ప్రతిపాదన పెట్టాల్సి వుంది.
ఆ ప్రతిపాదన రెడీ అయితే తప్ప టాలీవుడ్ జనాలకు పిలుపు రాదు. సెప్టెంబర్ 10 లోపు కొత్త రేట్లు వస్తాయన్న ధీమా కనిపించడం లేదు. పైగా ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు, టాలీవుడ్ వైపు నుంచి ప్రతిపాదనలు, వీటి పరిశీలను, ఇవన్నీ జరిగేసరికి చాలా కాలం పట్టేలాగే వుంది.