బాలీవుడ్ నటుడు సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే అని బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ పెద్దల వైఖరే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని, అందువల్ల వాళ్లే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో రెండు నిమిషాల నిడివిగల వీడియోను కంగనా విడుదల చేశారు.
ఈ వీడియోలో సుశాంత్ మృతిపై పలు సంచలన ఆరోపణలు, ప్రశ్నలు లేవనెత్తారు. సుశాంత్ చాలా అద్భుతమైన నటుడన్నారు. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉందన్నారు. కానీ అవార్డు రానివ్వకుండా కొందరు పెద్దలు వెనుక తతంగం నడిపించారని కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్నో అద్భుత సినిమాలు, ‘చిచ్చోరే’ వంటి సందేశాత్మక చిత్రం కూడా చేసిన టాలెంటెడ్ యాక్టర్‌కు అవార్డు రాకపోవడం ఏంటి.? స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు? అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఇంకా ఆమె పలు సంచలన, ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలు వేశారు.
‘ కొత్తగా వచ్చే వారిని పైకి రానీయకుండా కొందరు బాలీవుడ్ పెద్దలు తెరవెనుక ప్లాన్స్ చేస్తుంటారు. కొత్తగా వచ్చి సక్సెస్ అవుతున్నారని గుర్తిస్తే చాలు… వారి సినిమాలపై నెగటివ్ రివ్యూస్ రాయించడం మొదలుకుని చాలా అడ్డంకులు సృష్టిస్తారు. సుశాంత్ విషయానికి వస్తే.. అతనొక డ్రగ్ బానిస అని చిత్రీకరించడానికి కూడా కొందరు స్కెచ్‌లు వేశారు. తన సినిమాలు ఆడకపోతే తనని ఇండస్ట్రీలో ఉండనీయరనే భయంతో ఒక దశలో సుశాంత్ తన సినిమాలు చూడండి అని అభిమానులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. వీటన్నిటిని చూస్తే.. అతని ఆత్మహత్యకు కారణం బాలీవుడ్ పెద్దలే అని అర్థమవుతుంది. వారు పెట్టిన టార్చర్ వల్లే సుశాంత్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు ’ అని కంగనా మండిపడింది.
సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్‌లోని వాస్తవ పరిస్థితులను బయటి ప్రపంచానికి తెలిసి వచ్చేలా చేస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను సృష్టించిన బాలీవుడ్ పెద్దలు, ఓ యువ హీరో మృతికి బాధ్యత వహించాలని కంగనా డిమాండ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఆమె వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.