చంద్ర‌బాబు అవే చొక్కాలు, అవే డ్రామాలు!

ఈ న‌ల్ల‌చొక్కాల పొలిటిక‌ల్ డ్రామాలు చంద్ర‌బాబు నాయుడుకు కొత్త కాదు. ఆయ‌న గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఇలాంటి చొక్కాల పొలిటిక‌ల్ డ్రామా ఒకటి ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అప్ప‌ట్లో అది పూర్తిగా…

ఈ న‌ల్ల‌చొక్కాల పొలిటిక‌ల్ డ్రామాలు చంద్ర‌బాబు నాయుడుకు కొత్త కాదు. ఆయ‌న గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఇలాంటి చొక్కాల పొలిటిక‌ల్ డ్రామా ఒకటి ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అప్ప‌ట్లో అది పూర్తిగా ఫెయిల్ అయ్యిందనే విష‌యం వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

భార‌తీయ జ‌న‌తా పార్టీతో తెగ‌దెంపులు చేసుకున్నాకా, అప్ప‌ట్లో అసెంబ్లీకి న‌ల్ల చొక్కాల‌తో హాజ‌రు కావ‌డం, ఇళ్ల‌లో కూర్చున్న తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు కూడా న‌ల్ల చొక్కాలు వేసుకోవాలి, న‌ల్ల బ్యాడ్జిలు ధ‌రించాల‌ని పిలుపులు ఇవ్వ‌డం జ‌రిగాయి. ఢిల్లీలో కూడా న‌ల్ల చొక్కాల ధ‌ర్నా ఒక‌టి చేశారు తెలుగుదేశం అధినేత‌.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే వ‌ర‌కూ బీజేపీతో స‌న్నిహితంగా మెలిగి, ఎన్డీయేలో త‌న ఎంపీలిద్ద‌ర్ని మంత్రులుగా కొన‌సాగించి, ఏ రాష్ట్రానికీ అంద‌నంత సాయం కేంద్రం నుంచి అందుతోంద‌ని అప్ప‌ట్లో ఎదురుదాడి చేసి, ప్ర‌త్యేక‌హోదా కావాల‌న్న వారిపై కేసులు పెట్టించి.. తీరా ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం చంద్ర‌బాబు నాయుడు రంగు మార్చి న‌ల్ల చొక్కా వేసుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ డ్రామాలు ప్ర‌జ‌లు గ్ర‌హించ‌లేనివి ఏమీ కాకుండా పోయాయి. కేంద్రంపై పోరాటం అంటూ.. అసెంబ్లీకి న‌ల్ల చొక్కాలు వేసుకుని వెళ్లినా, ఢిల్లీలో న‌ల్ల చొక్కాల‌తో ధ‌ర్నాలు చేసినా..ప్ర‌జ‌లు అయితే ఆ డ్రామాల‌ను న‌మ్మ‌లేదు. ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యింది. అలా న‌ల్ల చొక్కాల డ్రామాలు చంద్ర‌బాబుకు అచ్చిరాలేదు!

ఇక అవినీతి కేసుల్లో అరెస్టు అయిన త‌న పార్టీ వాళ్ల‌కు సంఘీభావంగా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ న‌ల్ల‌చొక్కాల డ్రామాను షురూ చేశారు. త‌న పార్టీ వాళ్లు అవినీతి చేయ‌లేదు, జేసీ ట్రావెల్స్ అక్ర‌మాలు చేయలేదు అని చంద్ర‌బాబు నాయుడు చెప్ప‌డం లేదు. ఆ అరెస్టుల‌పై మాత్రం నిర‌స‌న‌ట‌! ఇది కూడా పాత పొలిటిక‌ల్ డ్రామానే గుర్తు చేస్తూ ఉంది!

జగన్ తో పోటీ కష్టం బాబూ

రాజారెడ్డి మీసంలో వెంట్రుకకి కూడా సరిపోవు